Saiee Manjrekar: సల్మాన్‌కు చెప్పే చేస్తా

‘నేను చిత్రపరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయనే నా గురువు’ అని అంటోంది కథానాయిక సయీ మంజ్రేకర్‌. 2019లో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘దబాంగ్‌ 3’తో సినీరంగ ప్రవేశం చేసిందీ భామ.

Updated : 23 Mar 2024 10:58 IST

‘నేను చిత్రపరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయనే నా గురువు’ అని అంటోంది కథానాయిక సయీ మంజ్రేకర్‌. 2019లో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘దబాంగ్‌ 3’తో సినీరంగ ప్రవేశం చేసిందీ భామ. తర్వాత తెలుగులో ‘మేజర్‌’తో మంచి విజయాన్ని అందుకుంది. ‘గని’, ‘స్కంద’ లాంటి చిత్రాలతో అలరించిన సయీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల్ని పంచుకుంది. ‘నేను ‘దబాంగ్‌ 3’తో ప్రేక్షకులకు పరిచయమయ్యాను. అందులో ప్రధాన పాత్రలో మెప్పించిన సల్మాన్‌ అప్పటి నుంచి నా గురువు, మార్గదర్శి. అందులో నేను తక్కువ నిడివిగల పాత్ర చేసినా అగ్రతారతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావించా. చిత్రపరిశ్రమకి అప్పుడే కొత్తగా వచ్చిన వారికి ఇంత కంటే గొప్ప అవకాశం ఏది లేదని నా అభిప్రాయం. ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇప్పటికీ నేనే కొత్త సినిమా కోసం సంతకం చేసినా ఆయనకి తప్పకుండా చెప్తాను’ అంటూ తెలిపింది. తన వృత్తిపరమైన నిర్ణయాలలో తన తండ్రి, దర్శకనిర్మాత మహేశ్‌ మంజ్రేకర్‌ ఎప్పుడూ జోక్యం చేసుకోరని, ఉత్తమమైన సలహాలిస్తాడని చెప్పకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని