Salman Khan: వామ్మో! బిగ్‌బాస్‌-15కి సల్మాన్‌ పారితోషికం ఇంతనా..?

14 వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి సల్మాన్ అక్షరాలా రూ.350కోట్లు సల్మాన్‌ తీసుకుంటున్నారట.

Updated : 21 Sep 2021 08:51 IST

ముంబయి: రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కి ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై వినోదానికి చిరునామాగా నిలిచే ఈ షో.. హిందీలో బిగ్‌బాస్‌-15 సీజన్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ దీనికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 14 వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి సల్మాన్ అక్షరాలా రూ.350కోట్లు సల్మాన్‌ తీసుకుంటున్నారని బి-టౌన్‌ టాక్‌. వరుసగా బిగ్‌బాస్‌ పదకొండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఈ కండలవీరుడు. అంతేకాదు.. టీవీ షోల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హోస్ట్‌గా నిలిచాడు ‘సుల్తాన్’. గత సీజన్ల వారీగా సల్మాన్‌ఖాన్‌ ఒక్కో వారానికి ఎంత ఆర్జించాడంటే.. (సీజన్‌ 4 - 6) వరకూ రూ.2.5 కోట్లు, (సీజన్‌-7)కి రూ.5 కోట్లు  (సీజన్‌-13)కి రూ.13కోట్లు తీసుకున్నారు.

నాగార్జున రెమ్యునరేషన్‌ ఎంతంటే..

బిగ్‌బాస్‌ తెలుగుకి గత మూడేళ్లగా హోస్ట్‌గా అలరిస్తున్నారు హీరో అక్కినేని నాగార్జున. ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌-5కి వ్యాఖ్యాతగా రూ.11-12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. గతేడాది ప్రసారమైన సీజన్‌-4కి రూ.8కోట్లు తీసుకున్న నాగ్‌ ఈఏడాది అమాంతం తన పారితోషికాన్ని పెంచేశారు. సీజన్‌-3కి ఒక్కో వారానికి రూ.12 లక్షలు తీసుకున్నారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని