Samantha: మైనస్‌ 150 డిగ్రీల చలిలో సమంత.. క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు పోస్ట్‌

నటి సమంత (Samantha)తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు చెప్పారు.

Updated : 05 Nov 2023 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథనాయిక సమంత (Samantha) మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఓ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు చెప్పారు. ఈ థెరపీలో భాగంగా మైనస్‌ 150 డిగ్రీల చలిలో ఉండే ఓ టబ్‌లో కూర్చున్నారు. అలాగే క్రయోథెరపీ అంటే ఏంటి? దాని వల్ల ఉపయోగమేంటో తెలిపారు. క్రయోథెరపీ వల్ల వ్యాధి కారక క్రిములతో పోరాడే తెల్ల రక్తకణాలు పెరుగుతాయని.. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మానసిక ప్రశాంతతతో పాటు ఈ థెరపీ శరీరానికి ఎంతో శక్తినిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోను సమంత అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

ఇక ఇటీవల సమంత ఇండోనేషియాలోని బాలీకి వెకేషన్‌కు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపారు. తాజాగా ‘ది మార్వెల్స్‌’ సినిమా ప్రమోషన్స్‌లో స్టైలిష్‌ లుక్‌లో కనిపించి సందడి చేశారు. సినిమాల విషయానికొస్తే.. మయోసైటిస్‌ చికిత్స తీసుకోవడం కోసం సమంత కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.  పూర్తిగా ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టారు. చివరిసారిగా ‘ఖుషి’ సినిమాలో కనిపించి అలరించారు. అలాగే ఆమె నటించిన ‘సిటడెల్’ ఇండియన్‌ వెర్షన్‌ వెబ్‌సిరీస్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విషయం తెలుసుకోకుండా అపార్థం చేసుకోకండి: అనసూయ విజ్ఞప్తి

మరోవైపు సమంత శరీరంపై టాటూ విషయంపై కూడా సోషల్‌ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. ఆమె ఇటీవల ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అందులో ఆమె నడుముపై ‘చై’ అనే టాటూ కనిపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని