Sarkaaru Noukari: ఓటీటీలోకి ‘సర్కారు నౌకరి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఆకాశ్‌ గోపరాజు హీరోగా గంగనమోని శేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా  ‘సర్కారు నౌకరి’. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.

Updated : 12 Jan 2024 12:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది థియేటర్‌లో విడుదలైన మొదటి సినిమా ‘సర్కారు నౌకరి’ (Sarkaaru Noukari). గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ గోపరాజు హీరోగా పరిచయమైన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon prime) వీడియో వేదికగా ప్రసారమవుతోంది. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె.రాఘవేంద్రరావు నిర్మించారు. ఇందులో భావన హీరోయిన్‌గా నటించగా తనికెళ్ల భరణి, మధులత కీలకపాత్రలు పోషించారు.

క‌థేంటంటే: మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కొల్లాపూర్‌కు చెందిన కుర్రాడు గోపాల్ (ఆకాశ్‌ గోప‌రాజు). అతడికి త‌ల్లిదండ్రులు లేరు. క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వ ఉద్యోగం సాధిస్తాడు. ఈ క్ర‌మంలోనే త‌న సొంత మండ‌లానికి హెల్త్ ప్ర‌మోట‌ర్‌గా వ‌స్తాడు. ఎయిడ్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. ఊరూరా తిరిగి కండోమ్‌లు పంచ‌డం అత‌ని ప‌ని. త‌న ఫ్రెండ్ స‌హాయంతో పెద్ద‌ల్ని ఒప్పించి స‌త్య (భావ‌న‌)ను పెళ్లి చేసుకుంటాడు. ఆరంభంలో త‌న భ‌ర్త‌ది స‌ర్కారు నౌక‌రి అని స‌త్య ఎంతో పొంగిపోతుంది.  కానీ, ఆ త‌ర్వాత అత‌ను చేసే ప‌ని తెలిసి అస‌హ్యించుకుంటుంది. కండోమ్‌లు పంచుతున్న అతడిని ఊరి వాళ్లంతా ర‌క‌ర‌కాలుగా హేళ‌న చేయ‌డ‌మే కాక.. వాళ్ల కుటుంబాన్ని అంట‌రానివాళ్లుగా చూడ‌ట‌మే దీనికి కార‌ణం. దీంతో ఆ అవ‌మానాలు త‌ట్టుకోలేక భ‌ర్త‌ను ఆ ఉద్యోగం మానేయ‌మ‌ని పోరు పెడుతుంది. కానీ, దానికి గోపాల్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో స‌త్య పుట్టింటికి వెళ్లిపోతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఎయిడ్స్‌ను నియంత్రించేందుకు అత‌నెలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? అన్న‌ది మిగిలిన క‌థ‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని