Senthil Kumar: సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్ ఇంట విషాదం..

సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ ఇంట విషాదం నెలకొంది.

Updated : 15 Feb 2024 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ (Senthil Kumar) ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్‌ రూహి (Roohi) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే గురువారం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

సెంథిల్‌ 2009లో రూహిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సతీమణి అనారోగ్యం కారణంగానే సెంథిల్‌ సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఆయన ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌గా ఉండేవారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘సై’, ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చాయి. ‘ఐతే’ సినిమాతో సెంథిల్‌ కెరీర్‌ ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని