Siva Karthikeyan: ‘ప్రిన్స్‌’గా.. శివ కార్తికేయన్‌

శివ కార్తికేయన్‌ హీరోగా కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరియా ర్యాబోషప్క కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న

Updated : 10 Jun 2022 07:03 IST

శివ కార్తికేయన్‌ హీరోగా కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరియా ర్యాబోషప్క కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ ద్విభాషా చిత్రానికి ‘ప్రిన్స్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో కార్తికేయన్‌ తెల్లటి దుస్తులు ధరించి, చేతిలో గ్లోబ్‌ పట్టుకొని శాంతిని ప్రభోదించే వ్యక్తిలా కనిపించారు. ‘‘ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. భారత్‌లోని పుదుచ్చేరి, బ్రిటన్‌లోని లండన్‌ నేపథ్యాల్లో సాగుతుంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఆగస్ట్‌ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అని చిత్ర బృందం తెలిపింది. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని