Telusu kada: ‘కేజీఎఫ్‌’ భామతో సిద్దు జొన్నలగడ్డ.. ‘తెలుసు కదా’!

యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అందులో హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి నటించనుంది.

Published : 16 Oct 2023 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డి.జె టిల్లు’తో బాగా పాపులర్‌ అయ్యాడు సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఇప్పుడీ యంగ్‌ హీరో మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రంతో ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. తాజాగా దీని వివరాలను వెల్లడిస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఈ ప్రాజెక్ట్‌కు ‘తెలుసు కదా’ (Telusu kada)అనే ఆసక్తికర పేరును ఖరారు చేశారు. ఇందులో సిద్దు సరసన ‘కేజీఎఫ్‌’ భామ శ్రీనిధి శెట్టితో (Srinidhi Shetty) పాటు రాశీఖన్నా కూడా నటించనుంది. ‘ప్రేమిస్తూ ప్రేమను పొందడమే జీవించడానికి ఉన్న ఏకైక మార్గం’ అనే ట్యాగ్‌ లైన్‌తో ఈ సినిమా రూపొందనుంది. దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్న నీరజ కోన తన జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. దీంతో సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నాగార్జున, నితిన్‌తో పాటు మరికొందరు నటీనటులు కూడా ‘తెలుసు కదా’ వీడియోను షేర్‌ చేశారు. దీనికి తమన్‌ సంగీతం అందిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇక ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ  ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu sqaure) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ చిత్రం తర్వాత  వైష్ణవి అనే  కొత్త దర్శకురాలితో ఓ సినిమా (#siddu8) చేయనున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు