Dahaad: ఆ హత్యల కథే.. ‘దహాద్‌’.. టీజర్‌ చూశారా?

సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్‌ ‘దహాద్‌’ (Dahaad). ఈ సిరీస్‌ టీజర్‌ విడుదలైంది.

Published : 26 Apr 2023 19:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి మరో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిద్ధమైంది. సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), విజయ్‌వర్మ, గుల్షన్‌ దేవయ్య, సోహమ్‌ షా ప్రధాన పాత్రధారులుగా.. రీమా కగ్తీ, జోయా అఖ్తర్‌ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘దహాద్‌’ (Dahaad). మే 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను ప్రైమ్‌ వీడియో పంచుకుంది. సోనాక్షికి ఇది తొలి వెబ్‌ సిరీస్‌. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ వెబ్‌సిరీస్‌ను బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు. ఎనిమిది భాగాల క్రైమ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సిరీస్‌ను ఎక్సెల్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైగర్‌ బేబీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. పబ్లిక్‌ బాత్‌రూమ్‌లలో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు మహిళల హత్య కేసును ఛేదించడానికి అంజలి భాటి చేసిన ప్రయత్నాలు, కథలో ఊహించని మలుపులను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని