Sonali Bendre: ఎన్టీఆర్‌ చిత్రంలో సోనాలి బింద్రే.. స్పష్టతనిచ్చిన నటి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఎన్టీఆర్‌(NTR) త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 31 May 2022 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఎన్టీఆర్‌(NTR) త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. జూన్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో ఎన్టీఆర్‌ సరికొత్తగా కనిపించనున్నారు. ప్రస్తుతం పాత్రకు సంబంధించినట్లు మేకోవర్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రే(Sonali Bendre)ను చిత్ర బృందం సంప్రదించిందని వార్తలు వచ్చాయి. సినిమాను మలుపు తిప్పే ఆ పాత్రలో ఆమె నటిస్తారని అన్నారు. తాజా వార్తలపై సోనాలి స్పందించారు.

ఎన్టీఆర్‌ 30లో మీరు నటిస్తున్నారట కదా! అని ప్రశ్నించగా, ‘‘నేనా.. నిజంగా నాకు తెలియదు. దయ చేసి దాని గురించి మీరే చెప్పండి. మీరు మాట్లాడేదాని గురించి కొంచెం కూడా సమాచారం లేదు. బహుశా అది నేను కాదేమో. అవన్నీ అసత్యవార్తలు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఇదంతా ఏదో థ్రిల్లర్‌లా ఉంది’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌-కొరటాల చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. మరోవైపు సోనాలి హిందీలో
‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. జీ5లో త్వరలోనే ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని