Alluri: ఆకట్టుకునేలా ‘అల్లూరి’ టీజర్.. పోలీస్ పాత్రలో అదరగొట్టిన శ్రీవిష్ణు
‘‘విప్లవానికి నాంది చైతన్యం. చైతన్యానికి పునాది నిజాయితీ. నిజాయితీకి మారుపేరు అల్లూరి సీతారామరాజు’’ అంటున్నారు నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన ప్రధాన పాత్రలో నటించిన....
హైదరాబాద్: ‘‘విప్లవానికి నాంది చైతన్యం. చైతన్యానికి పునాది నిజాయతీ. నిజాయతీకి మారుపేరు అల్లూరి సీతారామరాజు’’ అంటున్నారు నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘అల్లూరి’ (Alluri). పోలీస్ అధికారి ఫిక్షనల్ బయోపిక్‌గా ఇది సిద్ధమవుతోంది. ప్రదీప్‌వర్మ (Pradeep Varma) దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఈ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్..! పోలీస్.. బయలుదేరాడురా’’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఇందులో శ్రీవిష్ణు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విభిన్నమైన లుక్‌లో దర్శనమివ్వనున్నారు
నిజాయతీ ఉన్న ఒక పోలీసు అధికారి కథ చెప్పాలనే ఉద్దేశంతో ఎంతో పరిశోధన చేసి.. తాను ఈ కథను రూపొందించినట్లు ప్రదీప్ తెలిపారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అల్లూరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అతను చేసిన త్యాగాలేంటి? సమాజం, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు? అన్న కోణాల్లో ఈసినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!