సర్పంచిగా సందడి చేస్తోన్న రాజా రవీంద్ర!

‘నువ్వు సర్పంచిగా గెలిచావు. ఈ రోజు నుంచి ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు’ అని రాజా రవీంద్రని ఉద్దేశించి డైలాగ్‌ చెప్తూ నవ్వుల పూయిస్తున్నాడు హైపర్‌ ఆది.

Published : 10 May 2021 22:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నువ్వు సర్పంచిగా గెలిచావు. ఈ రోజు నుంచి ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు’ అని నటుడు రాజా రవీంద్రని ఉద్దేశించి డైలాగ్‌ చెప్తూ నవ్వుల పూయిస్తున్నాడు హైపర్‌ ఆది. ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి విచ్చేశారు రాజా రవీంద్ర. తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ షోలో రాజా సర్పంచిగా కనిపించి తనదైన శైలిలో కామెడీ పండించారు. ఆటో రాం ప్రసాద్‌, సుడిగాలి సుధీర్‌కి కౌంటర్‌ ఇస్తూ సందడి చేశారు. ఈ అల్లరితోపాటు ఓ ప్రత్యేక గీతం, రేవంత్‌ గానం ఆకట్టుకుంటున్నాయి. మరి రాజా రవీంద్ర సర్పంచిగా మారి ఏం చేశాడు? ఈ గ్యాంగ్‌తో ఆయనకున్న సంబంధం ఏంటి తెలియాలంటే మే 16 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని