అందుకే ప్లాస్మాదానం చేయలేకపోయా: రాజమౌళి

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా నుంచి బయటపడిన

Updated : 01 Sep 2020 16:39 IST

హైదరాబాద్‌: అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా నుంచి బయటపడిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాల్సిందిగా కోరారు. తాజాగా ప్లాస్మాను దానం చేయడానికి వెళ్లగా తన శరీరీంలోని యాంటీ బాడీల ఐజీజీ స్థాయులు తక్కువగా ఉండటంతో సాధ్యపడలేదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘నా శరీరంలో యాంటి బాడీలను పరీక్షించగా, ఐజీజీ స్థాయులు 8.62శాతంగా ఉంది. ఎవరైతే 15శాతం కన్నా ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలను కలిగి ఉంటారో వారు ప్లాస్మా దానం చేయడానికి అర్హులు. పెద్దన్న, భైరవ ఈరోజు తమ ప్లాస్మాను డొనేట్‌ చేశారు. మన శరీర వ్యవస్థలో యాంటీబాడీలు తయారై కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న అందరికీ ఇదే నా విన్నపం దయచేసి ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రండి. ఒక జీవితాన్ని కాపాడిన వాళ్లుగా నిలవండి’’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్‌ఆర్ఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈలోగా జక్కన్న కరోనా బారినపడి కోలుకున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతి ఇవ్వగా, ఎలా మొదలు పెట్టాలన్న అంశంపై ప్రస్తుతం చిత్ర బృందం సమాలోచనలు జరుపుతోంది. పరిస్థితులు అనుకూలించిన తర్వాత వైద్యులను సంప్రదించి షూటింగ్‌ మొదలు పెడతామని ఇటీవల రాజమౌళి తెలిపారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జనవరిలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు మరింత ఆలస్యం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని