Boyapati: కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో బోయపాటి సినిమా..!

మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తర్వాతి సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆసక్తిగా మారింది. కోలీవుడ్‌ హీరోతో ఈ సినిమా తీయనున్నట్లు సమాచారం. 

Published : 22 Sep 2023 13:25 IST

హైదరాబాద్‌:  ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ స్థాయిలో అలరిస్తుంటాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మాస్‌ దర్శకుడు తన తర్వాత సినిమాను సూర్యతో తీయనున్నారట. ప్రతి చిత్రంలోనూ ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకునే సూర్య (Suriya) త్వరలోనే బోయపాటి సినిమాలో నటించనున్నాడంటూ కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో  ‘కంగువా’(Kanguva)లో నటిస్తున్నాడు. దీని తర్వాత బోయపాటి సినిమా ప్రారంభమయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే సూర్యని బోయపాటి ఎలా చూపిస్తారా అని అందరిలో ఆసక్తి నెలకొంది. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా దీని అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బోయపాటి గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తనకు సూర్యతో సినిమా చేయాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వాళ్లిద్దరి కాంబోలో మూవీ కచ్చితంగా వస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీళ్లిద్దరి సినిమా పూర్తి యాక్షన్‌ సినిమాగా తెరకెక్కనుందట. 

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

ఇక సూర్య ‘కంగువా’ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల్ని అలరించనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రంలో సూర్య సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటాని నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు బోయపాటి ప్రస్తుతం రామ్‌ పోతినేనితో తీసిన ‘స్కంద’(Skanda) విడుదల కోసం ఆసక్తిగా ఉన్నారు. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రిలీజైన పాటలు, ట్రైలర్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని