Suriya: తెలుగు అభిమానులపై సూర్య స్పెషల్‌ ట్వీట్‌..

హీరో సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (Surya Son Of Krishnan) చిత్రం ఇటీవల రీరిలీజైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సూర్య ట్వీట్ చేశారు.

Published : 06 Aug 2023 12:30 IST

హైదరాబాద్‌: తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) తన నటనతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (Surya Son Of Krishnan) సినిమా ఇటీవల రీరిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేసిన సూర్య.. వారికి ధన్యవాదాలు తెలిపారు.

‘మీ ప్రేమాభిమానాలకు నేను ఆశ్చర్యపోయాను. ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ బెస్ట్‌’ అంటూ థియేటర్లో అభిమానులు సందడి చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతోంది. ఇక 2008లో గౌతమ్‌ వాసుదేవ్ మేనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. సూర్య ద్విపాత్రాభినయంతో అలరించిన ఈ చిత్రంలో ఆయన సరసన సమీరా రెడ్డి (Sameera Reddy), సిమ్రాన్‌ (Simran) నటించారు. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రంలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: తొలి కోస్టార్‌పై సాయి తేజ్‌ ప్రశంసలు

ఇక ప్రస్తుతం సూర్య పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’తో (Kanguva) బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది.  మృణాల్‌ ఠాకూర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సూర్య ఐదు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. దీన్ని త్రీడీలో దాదాపు పదికి పైగా భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని