Sai Dharam tej: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: తొలి కోస్టార్‌పై సాయి తేజ్‌ ప్రశంసలు

‘రేయ్‌’ సినిమా కథానాయిక సయామీ ఖేర్‌ (Saiyami Kher)ను ఉద్దేశిస్తూ సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) తాజాగా ట్వీట్‌ చేశారు. ఆమెను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.

Published : 05 Aug 2023 19:42 IST

హైదరాబాద్‌: తన తొలి చిత్రం ‘రేయ్‌’ కోస్టార్‌ సయామీ ఖేర్‌ (Saiyami Kher)ను ఉద్దేశిస్తూ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) తాజాగా ట్వీట్‌ చేశారు. సయామీని చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. ఆమె నటించిన కొత్త చిత్రం ‘ఘూమర్‌’ (Ghoomer) ట్రైలర్‌ను షేర్‌ చేసిన ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘సయామీ.. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆల్‌ ది బెస్ట్‌. నీ (మన) తొలి చిత్రం ‘రేయ్’ నుంచి ఈ ప్రత్యేకమైన సినిమా ‘ఘూమర్‌’ వరకూ నీ ప్రయాణం అద్భుతంగా సాగింది. నీ ఓపిక, లక్ష్యానికి ఇది నిదర్శనం. నువ్వు మరెంతో ఎత్తుకు ఎదగాలని.. నేను ఎంతటి ఆనందాన్ని అయితే పొందుతున్నానో నీ కుటుంబం కూడా అలాగే గర్వపడాలని ఆశిస్తున్నా. ఆర్‌ బాల్కి, అభిషేక్‌ బచ్చన్‌ సారథ్యంలో ఈ కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉన్నా’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

లలిత్‌ మోదీతో ప్రేమాయణం.. కామెంట్స్‌పై తొలిసారి స్పందించిన సుస్మిత

నాసిక్‌కు చెందిన సయామీ.. ‘రేయ్‌’తో నటిగా తెరంగేట్రం చేశారు. ఆ సినిమా తర్వాత ఆమె హిందీ, తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. నటిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఆమె ఎంతో శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె యాక్ట్‌ చేసిన సరికొత్త చిత్రం ‘ఘూమర్‌’. క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈసినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషించారు.

అనీనా (సయామీ ఖేర్‌) అనే అమ్మాయి మన దేశం తరఫున క్రికెట్‌ ఆడటానికి ఎంపికైన కొద్దిరోజులకే ఒక ప్రమాదంలో తన చేతిని కోల్పోతుంది. మరి ఒకే చేతితో దేశం కోసం ఆడాలన్న తన కోరిక తీరుతుందా?, ఆమె కల నెరవేరటానికి తన కోచ్‌ అయిన అభిషేక్‌ ఎలా సహాయం చేస్తాడు? అనే ఆసక్తికర కథాంశంతో ‘ఘూమర్‌’ సిద్ధమైంది. ఆగస్టు 18న ఇది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని