Tamannaah: నా కల నిజమైంది.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా: తమన్నా

ఈ ఏడాది అగ్రహీరోల సినిమాలతో బిజీగా ఉంది తమన్నా (Tamannaah). తాజాగా ఓ కార్యక్రమానికి హజరైన ఆమె ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది.

Updated : 12 Feb 2023 14:42 IST

హైదరాబాద్‌: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ‘గుర్తుందా శీతాకాలం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకునే ఈ అమ్మడు ఇప్పుడు ఇద్దరు అగ్ర హీరోలతో ఆడిపాడడానికి సిద్ధమైంది. ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar) సినిమాలో చిరంజీవితో, ‘జైలర్‌ (Jailer)’లో రజనీకాంత్ ‌(Rajinikanth)తో ఈ బ్యూటీ నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు సినిమాల గురించి తమన్నా మాట్లాడింది.

‘‘రజనీకాంత్‌ సర్‌తో కలిసి పనిచేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నా కల నిజమైంది. ఆయన్ని సెట్‌లో చూసే రోజు కోసం ఎదురుచూశా. అలాగే చిరంజీవి (Chiranjeevi)తో కలిసి నేను ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa NarasimhaReddy) లో నటించాను. ఇప్పుడు మళ్లీ ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar)లో నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది తమన్నా. ఇక తమన్నా ఈ సినిమాలతో పాటు హిందీలో ‘బోల్ చుడీయా’, మలయాళంలో ‘బాంద్రా’ చిత్రాల్లోనూ నటిస్తోంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌లతోనూ సందడి చేయడానికి సిద్ధమైందీ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఆహా కోసం ‘లెవెన్త్‌ అవర్‌’ లో నటించిన తమన్నా.. అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌లలోనూ వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని