Tammareddy Bharadwaj: ఇంత అసహ్యంగా మాట్లాడతారా.. నాకు సంస్కారం ఉంది: తమ్మారెడ్డి
Tammareddy bharadwaj: ‘ఆర్‌ఆర్‌ఆర్’పై తాను చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చిన విమర్శలను దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తిప్పికొట్టారు. తానూ అదే స్థాయిలో స్పందించగలనని, కానీ తనకు సంస్కారం ఉందని అన్నారు.
హైదరాబాద్: ‘ఆర్‌ఆర్‌ఆర్’పై దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ (Tammareddy bharadwaj) వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు-నిర్మాత నాగబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ ఈ వివాదంపై స్పందించారు. విద్యార్థులతో జరిగిన సెమినార్‌లో తాను మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. తాను ఆ స్థాయిలో స్పందించగలనని కానీ, తన తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. వారం కిందట రాజమౌళిని పొగుడుతూ ట్వీట్ చేస్తే, ఎవరూ స్పందించలేదని ఇప్పుడు వివాదాస్పదం చేశారని అన్నారు. ఈ వివాదాన్ని తాను కొనసాగించదలచుకోలేదని చెప్పారు.
‘‘గత వారం ఒక సెమినార్ జరిగింది. జాతీయ అవార్డు గ్రహీత ‘మా బంగారు తల్లి’ సినిమా దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ దీనికి సమన్వయకర్తగా ఉన్నారు. సినిమాపై ప్రేమ ఉన్న 20 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సినిమా ఎలా తీయాలన్న అంశంపై చర్చించారు. చర్చలో భాగంగా సినిమాలు రెండు రకాలని, ‘రిలీజ్ అయి పేరు వచ్చే సినిమాలు.. పేరు కోసం తీసే సినిమాలు’ అని మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా అవార్డులు, రివార్డులు కోసం తీసే సినిమాల గురించి చెబుతుండగా, ‘మా సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అవుతాయా’ అని ఒకరు అడిగారు, ‘ఇవి ఫెస్టివల్స్ కోసం తీసే సినిమాలు. అక్కడకు పంపడానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. నాకు కూడా పూర్తిగా తెలియదు’ అని చెప్పా. ఈ మాటల సందర్భంలోనే ‘RRR’ గురించి ప్రస్తావన వచ్చి ‘అవార్డు వస్తుందా’ అని విద్యార్థులు అడిగారు. మాటల్లో దాని గురించి చెబుతూ ‘ఆర్ఆర్ఆర్‌కు అంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది. ఇప్పుడు ఆస్కార్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ డబ్బుతో ఎక్కువ సినిమాలు తీయొచ్చు’ అని మాత్రమే చెప్పా. అవార్డుల కోసం తీసే సినిమాలకు అంత డబ్బు ఖర్చు పెట్టి చేయలేం కాబట్టి, ప్రయత్నించవచ్చు’ అని విద్యార్థులకు సూచించా’’
‘‘రెండున్నర గంటల పాటు సినిమాల గురించి మాట్లాడితే, అది వదిలేసి, నిమిషం ఉన్న క్లిప్‌ను తీసుకుని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడారు. స్పందించడం తప్పు కాదు. నిజంగా ఫీలై ఉంటే, ‘మీరు మాట్లాడింది తప్పు’ అని నాకు చెప్పవచ్చు. ఒకరు అకౌంట్లు అడగుతున్నారు. ఒకరు అసభ్య పదజాలంతో తిడుతున్నారు. చాలా అసహ్యంగా ఉంది. నేను కూడా అలాగే రియాక్ట్ అవ్వవచ్చు. కానీ, నాకు సంస్కారం ఉంది. ఆవేశపడి ఆరోగ్యం చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేనేమీ గుర్తింపుకోసం ప్రాకులాడటం లేదు. ఈ వివాదాన్ని కొనసాగించాలన్న ఉద్దేశం కూడా లేదు. మూడు రోజుల కిందట కూడా ‘మన భారత దేశానికి గౌరవాన్ని తెస్తున్న రాజమౌళిని అభినందించాలి’ అని కూడా ట్వీట్ పెట్టా’ మనకు ఆస్కార్ అనేది ఆలోచనలో లేని విషయం. అలాంటిది ఇప్పుడు 99శాతం అవార్డు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు ఎవ్వరూ స్పందించలేదు. ఇప్పుడు అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. నన్ను నా తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారు. ధన్యవాదాలు’’ అని అన్నారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ.. ‘రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీ దగ్గర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ వంటి పేరుపొందిన దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా?’’ అంటూ దర్శకేంద్రుడు (Raghavendra Rao) ప్రశ్నల వర్షం కురిపించారు. నటుడు నాగబాబు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Nellore: అధికారుల తీరుకు నిరసనగా.. చెప్పుతో కొట్టుకున్న సర్పంచి
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్
-
Crime News
ఎల్బీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టంతో సొమ్మసిల్లి పడిపోయిన యజమాని
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు