Teja: ఇల్లు జప్తు.. లోన్‌ తీసుకోకూడదని అప్పుడు తెలిసింది: తేజ

‘అహింస’ (Ahimsa) సినిమా రిలీజ్‌ కోసం సిద్ధమవుతున్నారు దర్శకుడు తేజ (Teja). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 21 May 2023 16:13 IST

హైదరాబాద్‌: హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి కథలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తుంటారు ప్రముఖ దర్శకుడు తేజ (Teja). ‘సీత’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘అహింస’ (Ahimsa). అభిరామ్‌ దగ్గుబాటి హీరోగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఎలాంటి హంగులకు పోకుండా కంటెంట్‌కు అనుగుణంగా చిత్రాలను తెరకెక్కిస్తే తప్పకుండా అది ప్రేక్షకులకు రీచ్‌ అయ్యే అవకాశం ఉందని అన్నారు. తప్పుల నుంచే తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, వాటిని ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు.

‘‘నాకు జరిగిన అవమానాలు, నేను చేసిన తప్పులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మళ్లీ వాటిని చేయకూడదని నిర్ణయించుకుంటా. గతంలో ఇంటిపై లోన్‌ తీసుకున్నాను. మధ్యలో నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. ఇబ్బందులు తలెత్తడంతో బ్యాంక్‌ వాళ్లు ఇంటిని జప్తు చేస్తున్నట్లు గోడకు నోటీసు రాసిపెట్టారు. ఆ తర్వాత బ్యాంక్‌కు మొత్తం డబ్బు చెల్లించేశాను. జీవితంలో మళ్లీ లోన్‌ తీసుకోకూడదని గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్లు రాసిన నోటీసు తొలగించకుండా అలాగే ఉంచాను. ఇక, నేను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్‌లు అయ్యాయి. సినిమా చేస్తున్నప్పుడే హిట్‌ లేదా ఫ్లాప్‌ అనేది తెలుస్తుంది. అందుకే ఏ సినిమాపైనా నేను ఆశలు పెట్టుకోను’’ అని తేజ వివరించారు. అలాగే తన కుమారుడిని హీరోగా లాంచ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు