MAA Elections: మా పథకాలు సభ్యులకి భరోసా

‘‘భారతదేశంలో ఒక శక్తిమంతమైన నటుల సమూహంగా ‘మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌)’ ఉండాలి. అది నా కల. మేం అమలు చేయనున్న పథకాలు సభ్యులందరికీ భరోసాని కల్పిస్తాయి’’ అన్నారు హీరో మంచు విష్ణు. ఆయన ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 08 Oct 2021 07:19 IST

‘‘భారతదేశంలో ఒక శక్తిమంతమైన నటుల సమూహంగా ‘మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌)’ ఉండాలి. అది నా కల. మేం అమలు చేయనున్న పథకాలు సభ్యులందరికీ భరోసాని కల్పిస్తాయి’’ అన్నారు హీరో మంచు విష్ణు. ఆయన ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం తన ప్యానెల్‌ తరఫున మేనిఫెస్టోని ప్రకటించారు. తమ ప్యానెల్‌ విజయం సాధిస్తే రెండు ప్రభుత్వాలతో మాట్లాడి అర్హులైన నటులకి సొంత ఇల్లు వచ్చేందుకు కృషి చేస్తామని, అలాగే సొంత ఖర్చులతో ‘మా’ నూతన భనవం నిర్మిస్తామని విష్ణు ప్రకటించారు. ‘‘అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నవారికి ‘మా యాప్‌’ ద్వారా సభ్యుల పోర్ట్‌ ఫోలియోల్ని క్రియేట్‌ చేసి నిర్మాతలు, దర్శకులు, రచయితలకి అందిస్తాం. తెలుగు ఆత్మ గౌరవం ఉట్టి పడేలా సొంత డబ్బుతో ‘మా’ భవనం నిర్మిస్తాం. ప్రతి సభ్యుడికీ వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య బీమా, మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణ కోసం హైపవర్‌ కమిటీ ఏర్పాటు తమ ప్రాధాన్యం’’ అన్నారు విష్ణు. స్వచ్ఛంద సంస్థతో సర్వే చేయించి, అర్హులైన వృద్ధ పేద కళాకారులకి ఇప్పుడు ఇస్తున్న పింఛన్‌ని పెంచి అందించే ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ‘మా’ సభ్యత్వ రుసుము తగ్గింపు, నిధుల సేకరణ కోసం కల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఏర్పాటు, సభ్యుల పిల్లలకి సినిమాలపట్ల అభిరుచి ఉంటే వారికి మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని