Chiranjeevi: రూబిక్‌ క్యూబ్స్‌తో ‘చిరంజీవి’ని చేశారు

ప్రముఖ నటుడు చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు తమిళనాడుకి చెందిన ఆయన అభిమానులు. చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22)ని పురస్కరించుకుని ఆనంద్‌, బిందు ప్రియాంక రూబిక్‌ క్యూబ్స్‌తో చిరంజీవి బొమ్మను రూపొందించారు.

Updated : 24 Nov 2022 14:07 IST

చెన్నై: మెగాస్టార్‌ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు తమిళనాడుకి చెందిన ఆయన అభిమానులు. చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22)ని పురస్కరించుకుని ఆనంద్‌, బిందు ప్రియాంక రూబిక్‌ క్యూబ్స్‌తో చిరంజీవి బొమ్మను రూపొందించి, అందరినీ ఆకట్టుకుంటున్నారు. 955 రూబిక్‌ క్యూబ్స్‌తో దీన్ని డిజైన్‌ చేశారు. 6.5 అడుగుల ఎత్తు, 5.5 అడుగుల వెడల్పు కలిగిన ఈ ‘రూబిక్ క్యూబ్‌ చిరు’ అందరినీ ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు ఆనంద్‌, బిందులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ ఫీట్‌ కోసం వాళ్లెంత శ్రమించారో చూడండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని