Published : 31 Oct 2021 01:39 IST

Puneeth Rajkumar: అగ్రనటులందరినీ కాదని.. పునీత్ ఆయన కోసం ఎదురుచూశారట..!

బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(puneeth rajkumar) హఠాన్మరణం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన మృతిపై ప్రముఖలు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్నారు. హాస్య నటుడు డానిష్ సైత్‌ ఈ మరణ వార్త విని తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ‘నా హృదయం ముక్కలైంది. ఇది మాటల్లో చెప్పలేని బాధ. నా గురువు, నా హీరో, గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు’ అంటూ పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందిన కొందరు వ్యక్తులు చెప్పిన విషయాన్ని వెల్లడించారు. ‘కొంతకాలం క్రితం అమెజాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos), పునీత్ రాజ్‌కుమార్ హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు వచ్చారు. అక్కడి వాతావరణమంతా కోలాహలంగా ఉంది. కొందరు జెఫ్ బెజోస్‌తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. పునీత్ మాత్రం ఈ హడావుడికి దూరంగా, ఒక పక్కన నిల్చొని ఉన్నారు. అప్పుడు అమెజాన్ సిబ్బంది ఆయన దగ్గరకు వెళ్లి..‘అప్పూ, మీరెందుకు ఎవరితో ఫొటోలు దిగకుండా ఒక పక్కన ఉన్నారు? మీకు కావాల్సిన వ్యక్తి పేరు చెప్పండి. మేమే వారిని మీ దగ్గరకు తీసుకువస్తాం’ అంటూ అడిగారు. ‘నిజమా? అయితే నేను పంకజ్‌ త్రిపాఠి(Pankaj Tripathi)ని కలవాలి అనుకుంటున్నాను’ అని నవ్వుతూ సమాధానమిచ్చారట. చుట్టూ ఎంతమంది ఉన్నా మా అప్పూ అన్న ప్రతిభను గుర్తిస్తారు. అలాగే మంచితనాన్ని ఇట్టే పట్టేస్తారు’ అంటూ పునీత్ గొప్పతనాన్ని డానిష్‌ వివరించారు. ఇప్పుడు పంకజ్ త్రిపాఠి ప్రముఖ నటుడని అందరికీ తెలుసు. కానీ ఈ స్థాయికి వచ్చే క్రమంలో ఆయన ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు.

అలాగే కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడాన్ని పునీత్ తన బాధ్యతగా భావించేవారని డానిష్‌ చెప్పారు. ఆయన కన్నడ పరిశ్రమలో స్టార్‌గా వెలుగుతున్నప్పటికీ.. ఎంతో సాధారణంగా ఉంటారని, ఆయన్ను కలిసినవారికి ఈ విషయం వెంటనే అర్థమవుతుందన్నారు. పునీత్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్‌లో డానిష్ సైత్‌ ఫ్రెంచ్ బిర్యానీ సినిమాలో నటించారు. గత ఏడాది జులైలో ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని