dhee 13 kings vs queens: బుల్లితెరపై ‘లాహే లాహే’, రజనీకాంత్ హంగామా!
డ్యాన్సులతోపాటు నవ్వులు పంచే కార్యక్రమం ‘ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్’. ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమవుతున్న ఈ షోకి ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. తదుపరి ఎపిసోడ్‌కి సంబంధించి ‘కొరియోగ్రాఫర్ విత్ కంటెస్టెంట్’ రౌండ్‌ని రూపొందించారు.
ఇంటర్నెట్ డెస్క్: డ్యాన్సులతో పాటు నవ్వులు పంచే కార్యక్రమం ‘ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్’. ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమవుతున్న ఈ షోకి ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. తదుపరి ఎపిసోడ్‌కి సంబంధించి ‘కొరియోగ్రాఫర్ విత్ కంటెస్టెంట్’ రౌండ్‌ని రూపొందించారు. తాజాగా ప్రోమో విడుదలై, అలరిస్తోంది. క్వీన్స్ టీం ప్రదర్శించిన ‘ఆచార్య’ చిత్రంలోని ‘లాహే లాహే’ పాట కనుల పండగలా సాగింది. అధిక సంఖ్యలో డ్యాన్సర్లు కనిపించి ఆకట్టుకున్నారు. న్యాయనిర్ణేతల్ని ఫిదా చేశారు. ఈ ప్రోమోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీం లీడర్లు సుధీర్, ఆది, రష్మి, దీపికా సైతం ఈ పాటకి కాలు కదిపారు. ఈ పాటతోపాటు ‘సామజవరగమన’, ‘రారా సరసకు రారా’ గీతాలకి నర్తించిన ఆయా కంటెస్టెంట్లు, కొరియోగ్రాఫర్లు మెప్పించారు. రజనీకాంత్‌గా చలాకీ చంటి ఇచ్చిన సడెన్ సర్‌ప్రైజ్ వావ్ అనిపిస్తుంది. ‘అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు’ అని డైలాగ్ చెప్పి క్లాప్స్ కొట్టించారు. రజనీకాంత్ ‘బాబా’ చిత్ర లుక్‌లో దర్శనమిచ్చి సందడి చేశారాయన. మరి ఈ హంగామా అంతా చూడాలంటే జులై 28 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోతో ఆనందించండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు