Puri Jagannadh: గోవాలో పూరీ జగన్నాథ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌..  సెలబ్రిటీల విషెస్‌  

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పుట్టిన రోజు వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు తారలు...

Published : 28 Sep 2021 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ సమయంలో సినిమాని తెరకెక్కించి, ఘన విజయం అందుకునే దర్శకుల్లో పూరీ జగన్నాథ్‌ ఒకరు. కథానాయకుల పాత్రల్ని పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దటంలో ఆయన రూటే సెపరేటు. నేడు ఆయన పుట్టినరోజు. పూరీ సినిమాలు చూసినవారందరికీ ఆయనకి గోవా అంటే ఎంతిష్టమో అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. తక్కువమంది స్నేహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. కేక్ కట్ చేసి నటి ఛార్మికి తినిపించారు. ఈ ఇద్దరు కలిసి ‘లైగర్‌’ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక.

తారల శుభాకాంక్షలు..

* ‘లైగర్‌’ సినిమా కోసం రెండేళ్ల క్రితం మనం తొలిసారి కలుసుకున్నాం. దర్శకుడిగా, స్నేహితుడిగా, సంరక్షకుడిగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నాకెంతో ప్రోత్సాహం అందిస్తున్నారు. ఐ లవ్ యు పూరీ జగన్నాథ్‌ సర్‌. హ్యాపీ బర్త్‌ డే. - విజయ్‌ దేవరకొండ.

* హ్యాపీ బర్త్‌డే పూరీ జగన్నాథ్‌ సర్‌. మీ దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. - అనన్య పాండే.

* పుట్టిన రోజు శుభాకాంక్షలు పూరీ జగన్నాథ్‌ సర్‌. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.  - మహేశ్‌బాబు.

* హ్యాపీ బర్త్‌ డే పూరీ జగన్నాథ్‌! ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. - వెంకటేశ్‌.















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని