83 Movie Review: రివ్యూ: 83
83 movie review: రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘83’ చిత్రం ఎలా ఉందంటే..?
చిత్రం: 83; నటీనటులు: రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్, జీవా, తఖీబ్ సలీం, జతిన్, చిరాగ్పాటిల్, తదితరులు; సంగీతం: జులీస్ పాకియమ్, ప్రీతమ్; సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా; నిర్మాణ సంస్థ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్, విబ్రి మీడియా, కా ప్రొడక్షన్స్, నదియవాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, కబీర్‌ఖాన్ ఫిల్మ్స్; దర్శకత్వం: కబీర్‌ఖాన్; విడుదల: 24-12-2021.
భారతదేశం తొలిసారి క్రికెట్లో ప్రపంచకప్ గెలిచిన సందర్భం.. క్రికెట్ అభిమానులకే కాదు.. ప్రతి ఒక్క భారతీయుడి గుండె ఉప్పొంగిపోయిన సంవత్సరం. అప్పుడు భారత క్రికెట్ జట్టుపై అంచనాలు.. ఆటగాళ్ల మధ్య అనుబంధాలు, వారు చవి చూసిన అవమానాలు.. ఆట, ఆటగాళ్ల చుట్టూ అల్లుకొన్న ఎన్నో భావోద్వేగాలు.. ఇలా ప్రతి ఒక్కటి విలువైనదే. అలాంటి విలువైన, వివేక వంతమైన సన్నివేశాలతో తీర్చిదిద్దినదే ‘83’ చిత్రం. ఓ విజయం.. ఎందరో అనుమానాలు తీరుస్తుంది. ఎందరి ముఖాలపైనో వెలుగులు పూయిస్తుంది. ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలను నిజం చేస్తుంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానమవుతుంది. 1983లో భారత క్రికెట్ జట్టుపై ఉన్న అనుమానాలేంటో? వారి కలలేంటో? వారికి ఎదురైన ప్రశ్నలేంటో? చివరికి వెలిగిపోయిన ముఖాలేంటి? వెలవెలబోయిందెవరు?అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ‘83’ చూడాల్సిందే.
కథ: భారత జట్టు ప్రపంచ కప్ పోటీల కోసం ఇంగ్లండ్ బయలుదేరడంతో కథ మొదలవుతుంది. జట్టు మీద ఉన్న తక్కువ అంచనాలను చూపిస్తూ.. సభ్యులను పరిచయం చేస్తూ.. మనల్ని నేరుగా కథలోకి దించేశాడు దర్శకుడు. అక్కడ జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన. అసలైన మ్యాచుల్లో వెస్టిండిస్, జింబాబ్వే జట్లతో గెలుపు.. తర్వాత వరుసగా జట్టు ఓటమి. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఆటలో కపిల్‌దేవ్ విజృంభణ. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై గెలవడం.. జట్టు ఫైనల్‌కు చేరడం. అప్పటికే రెండు సార్లు విశ్వవిజేత అయిన వెస్టిండిస్ జట్టుతో తుది పోరు.. ఉత్కంఠగా సాగిన ఆ ఆటలో విజయం సాధించి.. భారత జెండాను లార్డ్స్ స్టేడియంలో సగర్వంగా ఎగిరేలా చేసిన క్రికెట్టు జట్టు సమష్టి కృషి. 1975, 1979 సంవత్సరాల్లో జరిగిన ప్రపంచకప్ పోటీల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన భారత జట్టు.. 1983లో ఏకంగా ప్రపంచకప్‌ను భరతమాత సిగలో అలంకరించినంత వరకూ ఉత్కంఠగా సాగిన సంఘటనల సమాహారమే ‘83’లో కథాంశం.
ఎలా ఉందంటే: పాసైపోయామని ముందే తెలిస్తే పరీక్ష ఫలితాలపై ఉత్కంఠ ఏముంటుంది? సాధారణంగా అయితే ఉండదు. కానీ, పరీక్ష రాసిన అభ్యర్థుల వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొన్న సంఘటనలు, సంఘర్షణను సరిగ్గా చెబితే అద్భుతంగానే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే చేసి విజయం సాధించాడు దర్శకుడు కబీర్‌ఖాన్. ‘లగాన్’ చిత్రం తొలిసారి చూసే వాళ్లకు కథ ఏమవుతుందోనన్న ఆతృత ఉంటుంది. కానీ, 1983లో భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్ గెలిచిందని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఉత్కంఠగా మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సరదా సన్నివేశాలు నవ్విస్తే, భావోద్వేగ సన్నివేశాలు గుండెలు తడిపేస్తాయి. వాటన్నింటినీ సరైన పాళ్లలో రంగరించాడు కబీర్.
ఓ సన్నివేశంలో భారత జట్టు ఇంగ్లాండ్‌కు బయలుదేరుతుంది. ఎయిర్పోర్ట్ అధికారి ఆటోగ్రాఫ్ కావాలని అడుగుతాడు. దానికేముంది తీసుకోండి అని జట్టు మేనేజర్ మన ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తాడు. అప్పుడు ఆ అధికారి ‘‘వీళ్లది ఎవరికి కావాలి. రిచర్డ్స్ ఆటోగ్రాఫ్ తీసుకొని రా’’ అని అంటాడు. మరో సన్నివేశంలో ఇంగ్లాండ్ వెళ్లాక మన జట్టు మేనేజర్ అక్కడి నిర్వాహకుల దగ్గరకు వెళ్లి తమకి ఇచ్చిన పాస్‌ల్లో లార్డ్స్ మైదానంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని ఫిర్యాదు చేస్తాడు. దానికి నిర్వాహకులు నవ్వి.. ‘‘మీరా లార్డ్స్ స్టేడియానికా? అంతదాకా వస్తే అప్పుడు చూద్దాం లే’’ అని అవమానకరంగా మాట్లాడతాడు. అప్పుడు మేనేజర్ కెప్టెన్ కపిల్‌దేవ్ దగ్గరికి వచ్చి ‘‘35 ఏళ్లైంది స్వాతంత్య్రం వచ్చి గౌరవం ఇంకా రాలేదు’’ అని పలికే సంభాషణలు అప్పటి మన జట్టు పరిస్థితిని కళ్లకు కడతాయి. ఇలా ఎన్నో అవమానాల మధ్య బరిలోకి దిగిన జట్టును విజయ పథంలో నడిపించిన కపిల్‌దేవ్ గుండెధైర్యం, ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఎక్కువ సన్నివేశాలు మైదానంలోనే ఉన్నాయి. మ్యాచ్‌లను ఎంత అద్భుతంగా చూపించారో భావోద్వేగాలను అంతే పకడ్బందీగా రక్తికట్టించారు. ఆసిమ్ మిశ్రా సినిమాటోగ్రఫి మనల్ని 1983 కాలంలోకి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశం కనులవిందుగా చూపించారు. నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత అందంగా మార్చింది. క్యాస్టూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ల కష్టం ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కన్పిస్తోంది.
ఎవరెలా చేశారంటే: సినిమాలో ఎక్కడా రణ్‌వీర్‌సింగ్ కనిపించలేదని నాగార్జున చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్లు నిజం. ఆహార్యం, ఆటతీరు, ఎక్స్‌ప్రెషన్స్‌లో రణ్వీర్.. కపిల్‌దేవ్‌ను అచ్చు గుద్దినట్లు దించేశాడేమో అనిపిస్తుంది. అవమానాలు, బాధలు, విజయాల్లో అతను ప్రదర్శించిన నటన ఆకట్టుకుంటుంది. ఆవేదన, ఆవేశం, నాయకత్వం లాంటి ఉద్వేగాలను సరిగ్గా ప్రదర్శించాడు. కపిల్కే ప్రత్యేకమైన నటరాజ్ షాట్ ఆడినప్పుడు అతనే క్రీజ్‌లో ఉన్నాడా?అనిపించిందంటే అతిశయోక్తి కాదు. కపిల్ భార్య రోమి భాటియా పాత్రలో తక్కువ సమయమే కనిపించిన దీపికా పదుకొణె తన పాత్రకు న్యాయం చేసింది. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించిన జీవా అందులో జీవించేశాడు. జట్టు మేనేజర్‌గా పంకజ్ త్రిపాఠి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. జీవా, అమ్మి విర్క్, జతిన్ సర్ణ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ నటనతో అదరగొట్టేశారు. పాత్రలు, ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని దర్శకుడు కబీర్‌ఖాన్ మలిచిన తీరు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. సంభాషణలు మనసుని హత్తుకునేలా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు మాత్రం డ్రామాటిక్‌గా సాగినట్లు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు, కెమెరా పనితనం బాగున్నాయి. జులీస్ పాకియమ్, ప్రీతమ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లింది. ‘‘కప్ గెలిచిన ఆ రోజు మేం భోజనం చేయలేదు. కడుపు ఖాళీగానే ఉన్నా ఆకలి లేదు. మా అందరి గుండెలు విజయంతో నిండిపోయాయి’’ అని కపిల్‌దేవ్ వాయిస్ ఓవర్‌తో కథ ముగుస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకుల గుండెలు భావోద్వేగం, సంతోషంతో నిండిపోతాయి.
బలాలు
+రణ్‌వీర్‌సింగ్
+సాంకేతిక బృందం పనితీరు
+కథ, కథనం, దర్శకత్వం
బలహీనతలు
-అక్కడక్కడా డ్రామాటిక్‌గా సాగే సన్నివేశాలు
చివరిగా: విజయం బౌండరీల్లో... భావోద్వేగాలు సెంచరీల్లో.. ‘83’ ప్రేక్షకుల మదిలో..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!