RRR: మా బంధం ‘ఆర్ఆర్ఆర్’తో ముగిసిపోదు: జూనియర్ ఎన్టీఆర్
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల సమయం దగ్గర పడుతోంది.
తిరువనంతపురం: యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అన్ని భాషల్లోనూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇటీవల చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ బుధవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో వేడుకను నిర్వహించింది. మలయాళ నటుడు టొవినో థామస్ (మిన్నల్ మురళి ఫేం) ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత దానయ్యగారికి ధన్యవాదాలు. నాతో ఓ సినిమా చేసేందుకు ఆయన చాలా సంవత్సరాలు ఎదురుచూశారు. తన చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదలవుతుంటే దర్శకుడికి అంతకుమించిన ఆనందం ఏముంటుంది. నా సినిమాల్ని అన్ని భాషలవారు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ధీర’, ‘ఈచ’, ‘బాహుబలి’ చిత్రాలకు కేరళలో విశేష స్పందన లభించింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. కేరళ ప్రాంతంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ సుమారు 25 రోజులు ‘సింహాద్రి’ సినిమా చిత్రీకరించాం’’ అని నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. వేడుకకు విచ్చేసిన టొవినో థామస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘‘నా ‘ధీర’ (మగధీర) సినిమాను మీరెంతగానో ఆదరించారు. కానీ, మీ ప్రేమకు కానుకగా ఎలాంటి వేడుకల్ని నిర్వహించలేకపోయాం. ‘చరణ్ కేరళ ప్రజలు నీపై ఎంతో ప్రేమ కురిస్తున్నారు. నవ్వు తప్పకుండా అక్కడికి వెళ్లాలి’ అని రాజమౌళి చెప్తుండేవారు. ‘ఆర్ఆర్ఆర్’తో అది ఇప్పుడు కుదిరింది. కేరళ ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడి ఆహారం నాకెంతో ఇష్టం. మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన టెక్నిషియన్స్ ఉన్నారు. మేం.. మీ దర్శకులు, నటులను ఇష్టపడతాం. మీ సినిమాల నుంచి మేం స్ఫూర్తిపొందుతాం. ఎన్టీఆర్ నాలో సగభాగం. తను లేనిదే ఈ చిత్రం లేదు’’ అని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..‘‘చలన చిత్ర పరిశ్రమకు తమిళనాడు (తమిళ చిత్ర పరిశ్రమ) షెల్టర్ ఇస్తే టెక్నాలజీ విషయంలో కేరళ (మలయాళ చిత్ర పరిశ్రమ) జన్మనిచ్చింది. కేరళ చిత్ర పరిశ్రమకు ఎంతోమంది గ్రేట్ టెక్నీషియన్లను అందించింది. రాజమౌళి చెప్పినట్టుగా ‘సింహాద్రి’ కొంతభాగం షూటింగ్ ఇక్కడే జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది. అతిథిగా విచ్చేసిన నా బ్రదర్ టొవినో థామస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ‘ఆర్ఆర్ఆర్’ వల్ల నేనూ చరణ్ స్నేహితులం కాలేదు. అంతకు ముందే మేం ఫ్రెండ్స్. మా స్నేహం వల్లే ‘ఆర్ఆర్ఆర్’ సాధ్యమైంది. 200 రోజులు నా సోదరుడి (చరణ్)తో గడిపే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెబుతున్నా. మా బంధం ‘ఆర్ఆర్ఆర్’తో ముగిసిపోతుందని నేను అనుకోవట్లేదు. మేమెప్పుడూ ఇలానే ఉండాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్