Samantha: అల్లుఅర్జున్‌పై సమంత ప్రశంసల వర్షం

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌పై నటి సమంత ప్రశంసల వర్షం కురిపించారు. ‘పుష్ప’రాజ్‌గా బన్నీ అదరగొట్టేశారని.. నటుడిగా ఆయన తనలో స్ఫూర్తినింపారని ఆమె అన్నారు. ఈ మేరకు తాజాగా  ‘పుష్ప’ చిత్రాన్ని వీక్షించిన సమం....

Published : 21 Dec 2021 01:41 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌పై నటి సమంత ప్రశంసల జల్లు కురిపించారు. ‘పుష్ప’రాజ్‌గా బన్నీ అదరగొట్టేశారని.. నటుడిగా ఆయన  స్ఫూర్తినింపారని ఆమె అన్నారు. ఈ మేరకు తాజాగా ‘పుష్ప’ చిత్రాన్ని వీక్షించిన సమంత ఇన్‌స్టాలో తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు. ‘‘మమ్మల్ని కట్టిపడేసే ప్రదర్శన.. తన నటనతో ప్రతిక్షణం స్ఫూర్తినింపితే అలాంటి నటీనటులను నేను ఎల్లప్పుడూ ప్రేరణగా తీసుకుంటాను. ‘పుష్ప’లో అల్లుఅర్జున్‌ నాకు అలాగే అనిపించారు. చిత్తూరు యాస నుంచి భుజాన్ని పైకి పెట్టే మేనరిజం వరకూ ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన అదరగొట్టేశారు. నిజంగా అద్భుతంగా ఉంది’’ అని సమంత పోస్ట్‌ చేయగా.. బన్నీ స్పందించారు. ‘‘డియర్‌ సమంత. మీరు నాపై కురిపించిన ఈ ప్రశంసలకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి’’ అని బన్నీ రిప్లై ఇచ్చారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ‘పుష్ప’రాజ్‌ అనే స్మగ్లర్‌గా కనిపించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక సందడి చేశారు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ పాటలో సమంత ఆడిపాడారు. డిసెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.173 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని