Samantha: పెళ్లి ఫొటోలు డిలీట్‌ చేసిన సామ్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) నెటిజన్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. గతంలో ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన తన పెళ్లినాటి ఫొటోలను తాజాగా సామ్‌ తొలగించారు. దశాబ్దకాలంగా...

Published : 28 Oct 2021 14:35 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) నెటిజన్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. గతంలో ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన తన పెళ్లినాటి ఫొటోలను తాజాగా సామ్‌ తొలగించారు. దశాబ్దకాలంగా ప్రేమ, నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు అక్టోబర్‌ 2న సామ్‌, నాగచైతన్య (Naga Chaitanya) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి వీరిద్దరూ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత.. తన ఇన్‌స్టా ఖాతా నుంచి చైతన్యతో కలిసి దిగిన ఫొటోలు తొలగించారు.

రానా ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి వేడుకల్లో చైతన్యతో దిగిన ఫొటోలు, న్యూ ఇయర్‌ రోజు గోవాలో దిగిన ఫొటోలతోపాటు నిశ్చితార్థం, పెళ్లి (కేవలం హిందూ సాంప్రదాయంలో జరిగిన పెళ్లివి మాత్రమే) చిత్రాలను సమంత ఇన్‌స్టా వేదికగా డిలీట్‌ చేసేశారు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబసభ్యులతో ఉన్న ఫొటోలు మాత్రం అలాగే ఉంచారు. దీంతో అభిమానులు ఆవేదనకు లోనవుతున్నారు. మరోవైపు సామ్ ప్రస్తుతం దుబాయ్‌ టూర్‌లో ఉన్నారు. తన స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌, మేకప్‌ ఆర్టిస్ట్ సద్నాసింగ్‌లతో కలిసి ఆమె టూర్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని