Social Look: 17 ఏళ్ల శ్రుతి.. సిస్టర్స్‌తో రామ్‌ చరణ్‌.. మనోజ్‌ నో క్యాప్షన్‌ 

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు.

Updated : 29 Aug 2021 20:03 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విషయాలివీ..

ప్రముఖ నటుడు రామ్ చరణ్‌ తన సిస్టర్స్‌ సుస్మిత, శ్రీజ, నిహారికతో కలిసి ఓ ప్రముఖ హోటల్‌లో భోజనం చేశారు. రాఖీ పండగ సమయంలో చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ల బిజీగా ఉండటంతో ఇప్పుడు ట్రీట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని నిహారిక షేర్‌ చేసింది.

తను మోడలింగ్‌ ప్రారంభించినప్పటి ఫొటోల్ని శ్రుతిహాసన్‌ అభిమానులతో పంచుకుంది. అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు. ‘ఫ్లాష్‌బ్యాక్‌’ పేరుతో షేర్‌ చేసిన ఈ ఫొటోల్లో శ్రుతి గుర్తుపట్టలేకుండా ఉంది.

‘నో క్యాప్షన్‌.. హ్యాపీ సండే డార్లింగ్స్‌’ అంటూ ఓ బీచ్‌ దగ్గర దిగిన ఫొటోను పెట్టారు నటుడు మంచు మనోజ్‌.

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ తన స్నేహితుల గురించి చెప్పుకొచ్చింది. తన క్లోజ్ ఫ్రెండ్స్‌ జాబితాలో నటి మలైకా అరోరా ఉంది.

యువ నటుడు నిఖిల్‌ వ్యాయామం చేస్తూ కనిపించాడు.


































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని