Sridevi Drama Company: హావభావాల అంత్యాక్షరి.. నవ్వులే నవ్వులు

ఎక్స్‌ప్రెషన్ల (హావభావాలు)తో అంత్యాక్షరి ఆడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అసలు ఇలాంటి వినూత్న అంత్యాక్షరి ఉంటుందా అనుకుంటున్నారా? అయితే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ తాజా ప్రోమోను చూసేయండి..

Updated : 17 Aug 2022 10:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హావభావాలతో అంత్యాక్షరి ఆడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అసలు ఇలాంటి వినూత్న అంత్యాక్షరి ఉంటుందా అనుకుంటున్నారా? అవును.. అంటే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం చూడాల్సిందే. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం ఇది. బుల్లితెర ప్రేక్షకులకి ప్రతి ఆదివారం వినోదం పంచుతుంటుంది. సెప్టెంబరు 26న ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలై, సందడి చేస్తోంది. ఇందులో ఆది, హిమజ భార్యాభర్తలుగా కనిపించి నవ్వులు పూయిస్తున్నారు. ‘జబర్దస్త్‌’ నటులు రెండు బృందాలుగా ఏర్పడి అంత్యాక్షరి ఆడిన తీరు చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. సాధారణంగా ఆడే అంత్యాక్షరిలా కాకుండా ఒక్కక్కరు ఒక్కో విధమైన ఎక్స్‌ప్రెషన్‌తో పాటని ప్రారంభించి విశేషంగా అలరించారు. అనంతరం విష్ణుప్రియ చేసిన డ్యాన్స్‌ వావ్‌ అనిపించేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ హంగామాని చూసేయండి... సరికొత్త అంత్యాక్షరిని చూసి ఎంజాయ్‌ చేయండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని