Gully Rowdy: విశాఖపట్నంలో రౌడీ గాడు.. షర్టు బటనిప్పాడు

సందీప్‌ కిషన్‌, నేహా హరిరాజ్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పాట విడుదలైంది. ‘విశాఖపట్నంలో రౌడీ గాడు..

Published : 14 Aug 2021 12:25 IST

హైదరాబాద్‌: సందీప్‌ కిషన్‌, నేహా హరిరాజ్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పాట విడుదలైంది. ‘విశాఖపట్నంలో రౌడీ గాడు.. షర్టు బటనిప్పాడు ఓ మై గాడు’ అంటూ సాగే ఈ పాటను నటుడు నితిన్‌ విడుదల చేశారు. యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ తర్వాత సందీప్‌ కిషన్‌, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. బాబీ సింహా ప్రతినాయకుడు. ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎంవీవీ సత్యనారాయణ, కోనా వెంకట్‌ నిర్మాతలు, పోసాని కృష్ణ మురళీ, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సాయి కార్తీక్‌ స్వరాలు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని