The Gray Man: ధనుష్‌ కోసం భారత్‌కు హాలీవుడ్‌ డైరెక్టర్స్‌

ప్రముఖ నటుడు ధనుష్‌ (Dhanush) కోసం హాలీవుడ్‌ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్‌ (Russo Brothers) భారత్‌కు వస్తున్నారు. వారు దర్శకత్వం వహించిన సరికొత్త...

Published : 11 Jul 2022 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ నటుడు ధనుష్‌ (Dhanush) కోసం ‘కెప్టెన్‌ అమెరికా’, ‘అవెంజర్స్‌’ సిరీస్‌ తదితర చిత్రాలను అందించిన దర్శక ద్వయం రస్సో బ్రదర్స్‌ (Russo Brothers) భారత్‌కు వస్తున్నారు. వారు దర్శకత్వం వహించిన సరికొత్త హాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది గ్రేమ్యాన్‌’ (The Gray Man). ధనుష్‌తో పాటు రియాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అనా డి అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌ తదితర హాలీవుడ్‌ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 22 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో ‘ది గ్రేమ్యాన్‌’ టీమ్‌ ప్రత్యేక ప్రకటన చేసింది. ధనుష్‌ను చూసేందుకు తాము భారత్‌ వస్తున్నామని, అందుకు ఎంతో ఆనందంగా ఉందని రస్సో బ్రదర్స్‌ వెల్లడించారు. ఇక ‘గ్రే మ్యాన్‌’లో వర్క్‌ చేయడంపై ధనుష్‌ స్పందించారు.

‘‘ది గ్రే మ్యాన్‌’ ఓ రోలర్‌కోస్టర్‌ వంటి చిత్రం. యాక్షన్‌, డ్రామా, క్రేజీ స్టంట్స్‌ ఇలాంటి ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసినందుకు, ఈ సినిమాలో నేనూ కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా షూట్‌ అత్యద్భుతంగా సాగింది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నా’’ అని ధనుష్‌ వివరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని