The Railway Men: ఆ భయానక క్షణాలను గుర్తు చేసేలా ‘ది రైల్వే మేన్‌’ టీజర్‌..!

‘భోపాల్‌ గ్యాస్‌ లీక్‌’ (Bhopal Gas Tragedy) దుర్ఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న వెబ్‌ సిరీస్‌ ‘ది రైల్వే మేన్‌’ (The Railway men). తాజాగా ఈ సిరీస్‌ టీజర్‌ విడుదలైంది.

Published : 28 Oct 2023 16:03 IST

ముంబయి: 1984 డిసెంబర్‌ 2.. దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన రోజది. భోపాల్‌లోని ఓ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీక్‌ కావడంతో ఊపిరాడక వేలాది మంది ఉక్కిరిబిక్కిరయ్యారు. విషపూరితమైన గాలిని పీల్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిదే సంఘటనను ఆధారంగా చేసుకుని శివ్‌ రావేల్‌ ఓ వెబ్‌సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. ఆర్‌ మాధవన్‌, కేకే మేనన్‌, దివ్యేందు, బాబిల్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘‘అప్పట్లో ఒక ప్రమాదం జరిగింది. అది కూడా భారీ స్థాయిలో చోటుచేసుకుంది. ఓల్డ్‌ భోపాల్‌లోని కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీకైంది. దాంతో ఆ నగరం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయ్యింది’’ అనే సంభాషణలతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. గ్యాస్‌ లీక్‌ కావడానికి ముందు, ఆ తర్వాత పరిస్థితులు.. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు పడిన అవస్థలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Chiranjeevi: నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అది: చిరంజీవి స్పెషల్‌ పోస్ట్‌

భోపాల్‌లో గ్యాస్‌లీకైన రోజు తమ ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది పౌరుల జీవితాలను కాపాడిన రైల్వే ఉద్యోగుల కథ నేపథ్యంలో ‘ది రైల్వే మేన్‌’ను తీర్చిదిద్దుతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 18 నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు