Arya: హీరో ఆర్య తొలి వెబ్‌సిరీస్‌.. ఉత్కంఠగా ‘ది విలేజ్‌’ ట్రైలర్‌

తమిళ హీరో ఆర్య నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘ది విలేజ్‌’. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 18 Nov 2023 05:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే ఎందరో హీరో, హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉంటూనే వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆర్య (Arya) సిద్ధమయ్యారు. ఆయన నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘ది విలేజ్‌’ (The Village). మిలింద్ రాజు దర్శకత్వం వహించారు. ది విలేజ్‌ అనే గ్రాఫిక్‌ నవల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఈ నెల 24 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అడవి సమీపంలో ఉండే ఓ భయానక గ్రామంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడు? అన్నది ఈ సిరీస్‌ కథాంశమని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

భోపాల్ గ్యాస్‌ దుర్ఘటన వెబ్‌ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి.. ఎందుకంటే!

ఈ సిరీస్‌లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్‌, జార్జ్‌ మయన్‌, పూజా రామచంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది. ఆర్య ప్రస్తుతం తెలుగులో ‘సైంధవ్‌’ (Saindhav)లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న చిత్రమిది. 2024 జనవరి 13న విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం.. ‘ది విలేజ్‌’ ట్రైలర్‌ను మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని