OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు.. ఇవే..!

OTT Movies and web-series: ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి అవేంటో చూసేయండి.

Published : 06 Jul 2023 14:55 IST

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.. టక్కర్‌..!

తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ ప్రత్యేకమైన ఆదరణ సొంతం చేసుకున్న హీరోల్లో సిద్ధార్థ్‌ ఒకరు. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన ‘టక్కర్‌’ (TAKKAR). ప్రముఖ దర్శకుడు శంకర్‌ శిష్యుడు కార్తిక్‌ జి.క్రిష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దివ్యాన్ష కథానాయిక. యూత్‌ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 7 నుంచి అందుబాటులో ఉండనుంది.


మనసుని హత్తుకునే ‘స్వీట్‌ కారం కాఫీ’..!

సీనియర్‌ నటి లక్ష్మి, మధుబాల, శాంతి బాలచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘స్వీట్‌ కారం కాఫీ’. బిజోయ్ నంబియార్, కృష్ణ మరిముత్తు, స్వాతి రఘురామన్ దీన్ని తెరకెక్కించారు. మూడు తరాలకు చెందిన ముగ్గురు మహిళలు.. ఓ ప్రయాణంలో కలిసి.. తమ జీవితానుభావాలను పంచుకునే కథాంశంతో ఇది సిద్ధమైంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.


స్పై థ్రిల్లర్‌.. 1B71

బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ విద్యుత్ జమ్వాల్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్‌ స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘IB71’. సంకల్ప్‌ రెడ్డి దర్శకుడు. జులై 7 నుంచి ఇది డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది.


మరిన్ని ఓటీటీ చిత్రాలు \ సిరీస్‌లు..!

అమెజాన్‌ ప్రైమ్‌:

  • అధురా - జులై 7 (హిందీ వెబ్‌ సిరీస్‌)
  • ది హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్ - జులై 7 (ఇంగ్లీష్‌ సిరీస్‌)

నెట్‌ఫ్లిక్స్

  • ద లింకన్ లాయర్ - జులై 6 (వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2)
  • ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్‌ - జులై 7 (ఇంగ్లీష్‌ సినిమా)
  • డీప్‌ ఫేక్‌ లవ్‌ - జులై 7 (ఇంగ్లీష్‌ రియాల్టీ షో)
  • ది ఔట్‌-లాస్‌ - జులై 7 (ఇంగ్లీష్‌ సినిమా)

జీ5

  • తర్‌లా - జులై 7 (హిందీ సినిమా)

జియో సినిమా

  • బ్లైండ్‌ - జులై 7 (హిందీ సినిమా)
  • ఉనాద్ - జులై 8 (హిందీ సినిమా)

సోనీ లివ్

  • ఫర్హానా - జులై 7 (తమిళం, తెలుగు సినిమా)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు