Pawan kalyan: పవన్‌పై అడిగిన ప్రశ్నకు మాత్రమే స్పందించిన ఊర్వశీ రౌతేలా.. ఏమన్నారంటే

ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) తాజాగా ట్విటర్‌ వేదికగా తనను ప్రశ్నలు అడగాలని అభిమానులను పేర్కొంది. అయితే ఇందులో పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్నకు మాత్రమే స్పందించడం విశేషం.

Updated : 31 Jul 2023 13:07 IST

హైదరాబాద్‌: నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) ఇటీవల పవన్ కల్యాణ్‌పై ట్వీట్‌ పెట్టి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్‌పై నెటిజన్‌ వేసిన ప్రశ్నకు స్పందించింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ నటి.. తాజాగా #Askurvashi హ్యాష్‌ ట్యాగ్‌తో ప్రశ్నలు అడగాలని పేర్కొంది. దీంతో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.

‘జగన్, పవన్‌ కల్యాణ్‌.. వీళ్లిద్దరిలో ఎవరి పేరును ఎంపిక చేస్తారు’ అని ఓ అభిమాని అడిగారు. దీనికి సమాధానమిచ్చిన ఊర్వశీ.. ‘పవన్‌ కల్యాణ్‌’ అంటూ రెండుచేతులు జోడించిన ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అయితే, అభిమానులు చాలా ప్రశ్నలు వేసినప్పటికీ ఊర్వశీ దీనికి మాత్రమే స్పందించింది. ‘మీకు ఇష్టమైన సినిమా ఏది’, ‘ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు’, ‘మీ అభిమాన క్రికెటర్‌ ఎవరూ’.. ఇలా వందకు పైగా ప్రశ్నలు వేసినా.. ఆమె దేనికీ స్పందించలేదు. 

ఆ సంతోషాన్ని మాటల్లో వివరించలేను: చిరంజీవి

ఇటీవల ఈ హీరోయిన్‌  పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ని ఏపీ సీఎం అని వ్యాఖ్యానిస్తూ ట్వీట్‌ చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.  ‘బ్రో’ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో తెరను పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. సంబంధిత పోస్ట్‌పై ట్రోల్స్‌ వెల్లువెత్తడంతో.. పవన్‌ పేరు ముందు సీఎం అనే పదాన్ని తొలగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని