‘బఫూన్‌’గా వైభవ్‌!

వైభవ్‌ కథానాయకుడిగా అశోక్‌ వీరప్పన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బఫూన్‌’. హోలి సందర్భంగా

Published : 30 Mar 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వైభవ్‌ కథానాయకుడిగా అశోక్‌ వీరప్పన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బఫూన్‌’. హోలి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో వైభవ్‌ డ్రామా నటుడిగా మైక్‌ ముందు నమస్కరిస్తూ కనిపించారు.

‘‘వల్లి తిరుమం’, ‘హరిచంద్ర మయానా కాండం’ వంటి నాటకాలు ప్రదర్శించే నాటక కళాకారుల జీవితాన్ని ఇందులో చూపించనున్నాం. నాటకంలో భాగంగా వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను ఎలా అధిగమిస్తారేనేది మిగిలిన కథగా సాగుతుంది. ఇందులో నిజ జీవితంలో నాటకాలాడే వాళ్లను మదురై నుంచి తీసుకొచ్చాం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది’’ అని దర్శకుడు అశోక్‌ వెల్లడించారు.

స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమౌతున్న చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తుండగా దినేష్‌ పురుషోత్తమన్‌ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. వెట్రి కృష్ణన్‌ ఎడిటర్‌. వైభవ్‌ తొలుత తెలుగులోనే ‘గొడవ’ చిత్రంతోనే వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘కాస్కో’, ‘అనామిక’ వంటి చిత్రాలు చేశారు. తెలుగువాడైనా తమిళంలోనే సినిమాలు చేస్తున్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని