Venkatesh: వెంకటేశ్‌ ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఘనంగా మెహందీ వేడుక

టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ ద్వితీయ కుమార్తె హయ వాహిని పెళ్లి పనులు మొదలయ్యాయి.

Updated : 15 Mar 2024 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ (Venkatesh) ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆయన రెండో కుమార్తె హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో నేడు వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న (మార్చి 14) మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రతా శిరోద్కర్‌ షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

గతేడాది అక్టోబర్‌లో హయ వాహిని నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు పెళ్లికి కూడా టాలీవుడ్‌ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రామానాయుడు స్టూడియో ఈ వివాహానికి వేదిక కానున్నట్లు సమాచారం. వెంకటేశ్‌, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని