Narappa Review: రివ్యూ: నారప్ప
Narappa Review: వెంకటేశ్ కీలకపాత్రలో నటించిన నారప్ప సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: నారప్ప; నటీనటులు: వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, నాజర్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామ్ తదితరులు; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు; ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్; నిర్మాత: కలైపులి ఎస్.థాను, డి.సురేశ్‌బాబు; రచన: వెట్రిమారన్(అసురన్); స్క్రీప్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల; బ్యానర్: సురేశ్ ప్రొడక్షన్స్, వి.క్రియేషన్స్; విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో
వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ అటు కుటుంబ ప్రేక్షకులకు, ఇటు యువతకు ఎప్పుడూ దగ్గరగా ఉండే అగ్ర కథానాయకుడు వెంకటేశ్. ఇక క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్ ‘అసురన్’ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది. ఈ విషయం కాస్త వివాదమైనా నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపారు. మరి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘నారప్ప’ ఎలా ఉంది? యువకుడిగా, తండ్రిగా వెంకటేశ్ ఏ మేరకు మెప్పించారు? శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ ఎలా ఉంది? ‘అసురన్’కు దీటుగా ‘నారప్ప’ ఉన్నాడా?
కథేంటంటే: నారప్ప(వెంకటేశ్) తన భార్య సుందరమ్మ(ప్రియమణి)తో కలిసి తనకున్న మూడెకరాల పొలం చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో హాయిగా జీవితం సాగిస్తుంటాడు. అతడికి మునికన్నా(కార్తీక్ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) ముగ్గురు పిల్లలు. ఆ ఊరి పెద్ద పండు స్వామి(నరేన్).. తన తమ్ముడి దొరస్వామి(దీపక్ శెట్టి) కోసం ఊళ్లో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు. కానీ, నారప్ప తన మూడెకరాల భూమిని మాత్రం ఇవ్వడు. ఈ విషయంలోనే పండు స్వామి, అతని మనుషులతో మునికన్నా గొడవపడి, పండుస్వామిని అవమానిస్తాడు. దీంతో మునికన్నాను దారుణంగా హత్య చేస్తారు. అన్నను చంపారన్న ప్రతీకారంతో పండుస్వామిని సిన్నబ్బ హత్య చేస్తాడు. దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. అప్పుడు నారప్ప ఏం చేశాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: డబ్బు ఉన్న వాడికీ లేనివాడికి, బలవంతుడికీ బలహీనుడికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఎన్నో కథలు వెండితెరను అలరించాయి. బలహీనుడు తిరగబడితే ఎంతటి బలవంతుడైనా మట్టి కరవాల్సిందే. ‘భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు’ అంటూ చదువు ఆవశ్యకతను వివరిస్తూ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తమిళంలో వచ్చిన ‘అసురన్’ ఎంతగానో అలరించింది. అదే కథను వెంకటేశ్ కీలక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’గా తీయడంలో విజయం సాధించారు. మాతృకలోని ఉన్న ఎమోషన్స్‌ను తెలుగులోనూ కొనసాగిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది.
పోలీసులు, రౌడీల నుంచి నారప్ప కుటుంబం తప్పించుకునే సన్నివేశాలతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు మెల్లిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పండుస్వామి, నారప్ప కుటుంబాల మధ్య వివాదం జరగడం, పండుస్వామిని చెప్పుతో కొట్టి అమానించడంతో ఇలా ప్రథమార్ధమంతా కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే మునికన్నా హత్యకు గురవుతాడో కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఆ క్రమంలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించగులుతున్నా నారప్ప తన చిన్న కొడుకుని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా అనిపిస్తాయి. విరామ సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్.
ద్వితీయార్ధంలో నారప్ప గతం చెప్పడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నాడు దర్శకుడు. మాతృక ‘అసురన్’ను యథావిధిగా ఫాలో అయ్యాడు. నారప్ప యువకుడిగా ఉన్నప్పుడు వచ్చే సన్నివేశాలు, నేపథ్యం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అవన్నీ పెద్దగా ఆకట్టుకోవు. అయితే, అటు యువకుడిగా, ముగ్గురు పిల్లలకు తండ్రిగా వెంకటేశ్ స్క్రీన్‌పై కనిపించిన తీరు మెప్పిస్తుంది. నారప్ప మేనకోడలిని అవమానించే సన్నివేశాల్లో బలమైన ఎమోషన్ లేదు. అయితే, ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి. ఇప్పటికే ‘అసురన్’ చూసిన వారికి ‘నారప్ప’లో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించవు. దీంతో కథంతా ముందే తెలిసిపోవడం ఈ సినిమాకు కాస్త మైనస్.
ఎవరెలా చేశారంటే: నారప్ప వెంకటేశ్ వన్‌మెన్ షో అని చెప్పవచ్చు. రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియార్టీ కనిపిస్తుంది. ఇక యాక్షన్ సన్నివేశాల్లో వెంకీమామ అదరగొట్టాడనే చెప్పాలి. ప్రియమణి, కార్తీక్‌రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా కార్తీక్‌రత్నం కనిపించేది కొద్దిసేపే అయినా, కథను మలుపు తిప్పే పాత్ర. సాంకేతికంగా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలు ఓకే. కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. అయితే, యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. ‘రా రా నరకరా.. నరకరా’ థీమ్ థియేటర్లో చూస్తే ఒళ్లుగగురు పొడవాల్సిందే.
శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మాతృకను ‘అసురన్’లో కనిపించిన థీమ్ యథావిధిగా ఇందులోనూ కనిపిస్తుంది. సన్నివేశాల విషయంలో పెద్దగా మార్పుల జోలికి వెళ్లలేదు. మార్తాండ్ కె.వెంకటేశ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. థియేటర్‌ను దృష్టిలో పెట్టుకుని నిడివి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి రీమేక్‌ను ఎంచుకున్నారు. అయితే, మార్పుల జోలికి అస్సలు పోలేదు. ‘అసురన్’ను ఫాలో అయిపోయారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా చూపించారు. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. కొన్ని చోట్ల కథాగమనం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఓవరాల్‌గా సినిమా ఓకే.
బలాలు: + వెంకటేశ్ నటన; + విరామ, పతాక సన్నివేశాలు; + సాంకేతిక వర్గం పనితీరు
బలహీనతలు: - నెమ్మదిగా సాగే కథనం; - ప్రారంభ, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు
చివరిగా: ‘నారప్ప’ వెంకటేశ్ వన్‌మ్యాన్ షో
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న