Vijay Deverakonda: అభిమానుల అత్యుత్సాహం.. నిమిషాల్లో మాల్‌ వదిలి వెళ్లిపోయిన విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యూత్‌లో ఈ హీరోకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అయితే, తాజాగా జరిగి..

Updated : 12 Aug 2022 13:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యూత్‌లో ఈ హీరోకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో అభిమానులు అత్యుత్సాహం కనబర్చడంతో విజయ్‌ దేవరకొండ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’ (Liger). పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. అనన్యా పాండే కథానాయిక. ఆగస్టు 25న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముంబయి, పట్నా‌, అహ్మదాబాద్‌లలో ఈవెంట్స్‌ ఏర్పాటు చేయగా.. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తాజాగా పుణెలో నిర్వహించిన ఈవెంట్‌లోనూ ఇదే క్రేజ్‌ కొనసాగింది. ఓ షాపింగ్‌మాల్‌ మొత్తం అభిమానులతో నిండిపోయింది. అదే సమయంలో స్టేజ్‌పైకి చేరుకున్న విజయ్‌ - అనన్యలను చూసి అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు. స్టేజ్‌ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ హీరోహీరోయిన్ల దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని కంట్రోల్‌ చేయడం కష్టమని భావించిన సెక్యురిటీ సిబ్బంది ఇదే విషయాన్ని విజయ్‌ - అనన్యకు చెప్పి వారిద్దర్నీ అక్కడి నుంచి పంపించి వేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని