Vikramarkudu Review: రివ్యూ: విక్రమార్కుడు
విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ‘విక్రమార్కుడు’ ఎలా ఉందంటే?
చిత్రం: విక్రమార్కుడు; నటీనటులు: విజయ్ సేతుపతి, సాయేషా, మడోనా సెబాస్టియన్, యోగిబాబు, సురేశ్ చంద్ర మేనన్ తదితరులు; సంగీతం: సిద్ధార్థ్ విపిన్; సినిమాటోగ్రఫీ: డుడ్లీ; ఎడిటింగ్: వి.జె.సాబు జోసెఫ్; నిర్మాత: విజయ్ సేతుపతి, అరుణ్ పాండియన్, డాక్టర్ కె.గణేశ్, ఆర్.ఎం.రాజేశ్‌కుమార్; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్; విడుదల: ఆహా
తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు విజయ్ సేతుపతి. తొలి నుంచి వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్నారు. ఇటీవల కాలంలో నేరుగా తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ యాక్షన్ కామెడీ చిత్రం ‘జుంగా’. బాక్సాఫీస్ వద్ద అలరించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇందులో విజయ్ సేతుపతి పాత్ర ఏంటి?ఆయన ఎలా నటించారు? తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందా?
కథేంటంటే: జుంగా(విజయ్ సేతుపతి) కండక్టర్‌గా పనిచేస్తుంటాడు. తను పనిచేసే రూట్లో రోజూ బస్సు ఎక్కే తమిళ అమ్మాయి (మడోనా సెబాస్టియన్)ను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని కొందరు ఆకతాయిలు ఏడిపిస్తుంటే వారిని చితక్కొడతాడు. ఈ విషయం తెలిసిన జుంగా తల్లి(శరణ్య) కోప్పడుతుంది. జుంగా తండ్రి, తాతలు ఇలా గొడవలకు వెళ్లి.. కుటుంబాన్ని సర్వనాశనం చేశారని, అందుకే తనని వాటికి దూరంగా తీసుకొచ్చి పెంచుతున్నానని చెబుతుంది. తన తండ్రి, తాతను మోసం చేసి, సినిమా ప్యారడైజ్ అనే థియేటర్‌ను రెడ్డి(సురేశ్ చంద్రమేనన్) తక్కువ ధరకే దక్కించుకున్నాడన్న విషయం తల్లి ద్వారా జుంగాకు తెలుస్తుంది. దీంతో ఆ థియేటర్‌ను ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాలని తన స్నేహితుడు యోయో(యోగిబాబు)తో కలిసి చెన్నై బయలుదేరతాడు జుంగా. థియేటర్ కోసం జుంగా ఏం చేశాడు? డాన్‌లా ఎలా మారాడు? రెడ్డి కూతురు యాళిని(సయేషా) ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: హీరో కుటుంబాన్ని మోసం చేసే విలన్.. హీరో అతడి దగ్గరకు వెళ్లి తన తండ్రి, తాత ఆస్తులను తిరిగి ఇచ్చేయమని చెప్పడం.. అప్పుడు హీరోను విలన్ అవమానించడం.. ఆ వెంటనే హీరో సవాళ్లు, ప్రతిజ్ఞలు చేయటం.. ఈ పాయింట్‌తో ప్రతి భాషలోనూ కొన్ని వందల సినిమాలు వచ్చాయి. రొటీన్ ఫార్ములా అయినా, ఆసక్తిగా తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే థీమ్‌తో తెరకెక్కిన తమిళ చిత్రం ‘జుంగా’ ఇప్పుడు ‘విక్రమార్కుడు’గా డబ్ అయింది. జుంగా కండక్టర్‌గా పనిచేయడం, తమిళ అమ్మాయితో ప్రేమ, గొడవలు.. జుంగా గతాన్ని అతని తల్లి చెప్పడం ఇలా ప్రథమార్ధమంతా పరమ రొటీన్‌గా, విసుగెత్తించేలా సాగుతుంది. దానికి తోడు పాత తమిళ సినిమాల్లో పాత్రలు ఏవిధంగా అతిగా ప్రవర్తిస్తాయో అలాగే అందరూ నటిస్తారు. ఆఖరికి విలక్షణ నటుడిగా పేరున్న విజయ్ సేతుపతి కూడా అలాగే నటిస్తుండటం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా రుచించదు. సీన్‌కు అవసరమైనంత కాకుండా తమ ప్రతిభనంతా చూపించాలని నటిస్తునట్లు ప్రతి సన్నివేశం సాగుతుంది.
ఎప్పుడైతే రెడ్డిపై జుంగా సవాల్ విసురుతాడో అప్పటి నుంచి కథ కాస్త ఆసక్తిగా ఉంటుంది. రెడ్డి కూతురు యాళిని కోసం జుంగా, యోయోలు పారిస్ వెళ్తారు. అక్కడ వచ్చే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. డబ్బులు పొదుపు చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పంచుతాయి. యాళినిని కిడ్నాప్ చేసి, రెడ్డిని బెదిరిద్దామనుకున్న జుంగాకు ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు? చివరకు తన థియేటర్‌ను ఎలా దక్కించుకున్నాడన్నది క్లైమాక్స్. పతాక సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నా పర్వాలేదు. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్త ఉపశమనం. యోగిబాబు లేకపోతే అది కూడా చప్పగా పరమ బోరింగ్‌గా సాగేది.
ఎవరెలా చేశారంటే: మంచి కథలు, పాత్రలు ఎంచుకునే నటులు అప్పుడప్పుడు ఇలాంటి రొటీన్ ఫార్ములాలను ఎందుకు ఎంచుకుంటారో తెలియదు. తెలుగులోనూ ఇలాంటి కథానాయకులు ఉన్నారు. బహుశా ఇతరులను నొప్పించటం ఇష్టంలేక, ముందుగా చేసిన వాగ్దానాల కారణంగా ఇలాంటి సినిమాలు చేయాల్సి వస్తుందేమో. విజయ్‌సేతుపతి కూడా అలాగే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా కొత్తదేమీ కాదు. తెలుగులో అల్లరి నరేశ్ ఇలాంటి పాత్రలు అలవోకగా చేసేశారు. అలాంటి పాత్రలో విజయ్ సేతుపతిని చూడటం కాస్త కష్టమే. పైగా ప్రథమార్ధంలో హీరో పాత్ర ప్రవర్తించే తీరు అసాధారణం. కథానాయికలు మడోనా సెబాస్టియన్, సాయేషాలు పర్వాలేదు. యోగిబాబు ఈ సినిమాకు ప్రధానబలం. చాలా వరకూ తనదైన టైమింగ్‌తో మెప్పించాడు. ఒకప్పుడు తెలుగులో బ్రహ్మానందం ఏవిధంగానైతే సినిమాకు బలం అయ్యేవారో అలాగే చాలా చోట్ల కథను తన భుజాలపై మోశారు. మిగిలిన పాత్రల్లో నటులు పరిధి మేరకు నటించారు.
సిద్ధార్థ్ విపిన్ సంగీతం ఓకే. అయితే, గుర్తుండిపోయే పాట ఒక్కటీ లేదు. డూడ్లీ కెమెరా బాగుంది. పారిస్ అందాలను చక్కగా చూపించారు. వి.జె. సాబు జోసెఫ్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సిందే. తెలుగులో డబ్ చేసినప్పుడైనా పాటలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. దర్శకుడు గోకుల్ పాత, రొటీన్ ఫార్ములా కథను ఎంచుకున్నాడు. ఈ కథకు విజయ్‌సేతుపతి కాకుండా మరో హీరోను ఎంచుకుని ఉంటే బాగుండేది. సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేదు. ఇక తెలుగు డబ్బింగ్ వరకూ పర్వాలేదు. అయితే టైటిల్ గంభీరంగా ‘విక్రమార్కుడు’ అని పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు. తమిళంలో పెట్టినట్లే ‘జుంగా’ అని పెడితే సరిపోయేది.
బలాలు
+ ద్వితీయార్ధం
+ యోగిబాబు - విజయ్ సేతుపతి మధ్య వచ్చే సీన్లు
బలహీనతలు
- ప్రథమార్ధం
- తెలిసిన కథ కావటం
- తమిళ ఓవరాక్షన్
చివరిగా: రొటీన్ ‘విక్రమార్కుడు’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్