- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
ఇంటర్నెట్ డెస్క్: 2024 ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు పోటీగా కుప్పం నియోజకవర్గం నుంచి నటుడు విశాల్ (Vishal) రంగంలోకి దిగబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలోనూ ఇది ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ విషయంపై విశాల్ స్పందించారు. అవన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నానని, కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే వదంతులు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఖండిస్తున్నా. రాజకీయాలకు సంబంధించి నన్ను ఇప్పటివరకూ ఎవరూ కలవలేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నా. ఏపీ పాలిటిక్స్‌లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం నాకు లేదు’’ అని విశాల్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘సామాన్యుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశాల్. ప్రస్తుతం ‘లాఠి’, ‘తుప్పరివాలన్ 2’ (తెలుగులో డిటెక్టివ్ 2) తదితర చిత్రాలతో విశాల్ బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Liger: అసలు ఏమిటీ ‘లైగర్’ ఫైట్..?
-
India News
India Corona: దేశవ్యాప్తంగా అదుపులో ఉన్నా.. దిల్లీలో ఆందోళనకరం..!
-
Ts-top-news News
KCR Kit: కేసీఆర్ కిట్‌లో ఈ పిల్లల పౌడర్‌ను ఉంచాలా? వద్దా?
-
Ap-top-news News
Andhra News: రైతుభరోసా ఇచ్చేందుకు కులమేంటి?: జడ్పీ మీటింగ్‌లో వైకాపా ఎమ్మెల్సీ
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Botsa: 2 ఫొటోల అప్లోడ్ కోసం బోధన ఆపేస్తారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..