Kiara Advani: ‘పెళ్లి తేదీ ప్రకటిస్తారా?’.. కియారా పోస్ట్‌పై నెటిజన్ల ప్రశ్నలు
బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ ఓ పోస్ట్ పెట్టగా నెటిజన్లు ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. డిసెంబరు 2న ఆమె అసలు విషయాన్ని బయటపెట్టనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సినిమా వాళ్లు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే చాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కామెంట్ చేస్తారు. తారలు అసలు విషయం చెప్పేలోపే ‘జరిగేది ఇదే’ అంటూ కొందరు జోస్యం చెబుతుంటారు. బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ (Kiara Advani) విషయంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆమె ఓ నటుడితో ప్రేమలో ఉందంటూ కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమ అనుబంధం గురించి క్లారిటీ ఇవ్వని కియారా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరి దృష్టినీ ఆకర్షించేలా చేసింది. తన ఫొటోషూట్‌కు సంబంధించిన క్లిప్పింగ్‌ను పంచుకుంటూ ‘‘దీన్ని ఎక్కువకాలం రహస్యంగా ఉంచాలనుకోవట్లేదు. త్వరలో తెలుస్తుంది.. చూస్తుండండి.. డిసెంబరు 2న’’ అని పేర్కొంది.
ఆమె ఏ విషయం గురించి అలా పెట్టిందోగాని పలువురు నెటిజన్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ‘మీ పెళ్లి తేదీ ప్రకటిస్తారా?’, ‘క్రష్‌తో మీ వివాహం ఎప్పుడు ఖరారైంది?’, ‘ఊహించినట్టే పెళ్లి కబురు వినిపిస్తారా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. లక్షల లైక్స్ సొంతం చేసుకున్న కియారా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి, కియారా ఏ రహస్యాన్ని బహిర్గతం చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా. ఆ తర్వాత రామ్‌చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’లో కనిపించారు. మరోసారి ఆయనతో కలిసి #RC15 (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని వీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandrababu: వైఎస్ వివేకా హత్య.. జగన్ ఇప్పుడు తప్పించుకోలేరు: చంద్రబాబు
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
India News
Job vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే..!
-
India News
US Visa: వీసా రెన్యువల్‌కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!