Frontline Workers కోసం నాని సర్‌ప్రైజ్‌

కరోనా ప్రారంభం నుంచి అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ మాత్రం ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. అయితే.. అలాంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం ఏదో ఒకటి చేయాలని ప్రముఖ కథానాయకుడు నాని నిర్ణయించుకున్నారు.

Published : 08 Jun 2021 21:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ప్రారంభం నుంచి అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ మాత్రం ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. అయితే.. అలాంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం ఏదో ఒకటి చేయాలని ప్రముఖ కథానాయకుడు నాని నిర్ణయించుకున్నారు. మన ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం త్వరలోనే ఒక ప్రత్యేకత రాబోతోంది అని ప్రకటించారు. ఈ మేరకు ఒక ఫొటోను కూడా పంచుకున్నారు. అయితే.. నాని ఇవ్వబోయే సర్‌ప్రైజ్‌ ఏంటో చెప్పలేదు.

‘‘కోవిడ్19 పరిస్థితుల్లో కరోనా బాధితులను ఉత్సాహపరిచేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఆసుపత్రుల్లో డ్యాన్స్‌లు చేస్తున్న వీడియోలు చూశాం. ఈ ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయటం నా వంతు బాధ్యత’‘ అని నాని అన్నారు.

కాగా.. ఆ పోస్టులో మ్యూజిక్‌ సింబల్‌తో పాటు స్టెతస్కోప్‌, హార్ట్‌ ఎమోజీలు జతచేసి ఉన్నాయి. పైగా చిత్రంలో నాని కెమెరా పట్టుకొని కనిపిస్తున్నారు. ఆయనతో పాటు బృందం సభ్యులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల శ్రమను కళ్లకు కట్టేందుకు ఒక పాట చిత్రీకరించి విడుదల చేయనున్నట్లు అర్థమవుతోంది. మరి నిజంగానే నాని ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల గొప్పతనం చాటిచెప్పేలా వీడియో సాంగ్‌ చేయనున్నారా..? లేదా ఇంకేమైనా ప్లాన్‌ చేస్తున్నారా..? తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడక తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని