న్యూయార్క్‌ టైంస్క్వేర్‌లో ఎన్టీఆర్‌ చిత్రరాజం

శతజయంతి ఉత్సవాల సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్‌ టైంస్క్వేర్‌లో ఎన్టీఆర్‌ నిలువెత్తు చిత్రాలను ప్రదర్శించారు.

Updated : 30 May 2023 06:14 IST

ఈనాడు, అమరావతి: శతజయంతి ఉత్సవాల సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్‌ టైంస్క్వేర్‌లో ఎన్టీఆర్‌ నిలువెత్తు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేయడంతో పాటు.. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అమెరికా కాలమానం ప్రకారం మే 27వ తేదీ అర్ధరాత్రి నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు.. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి.. 15 సెకన్ల చొప్పున 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో ఎన్టీఆర్‌ చిత్రాలను ప్రదర్శించడం అరుదైన గౌరవంగా ఎన్నారై తెదేపా(యూఎస్‌ఏ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.


అమెరికాలో తెలుగు వారసత్వ వారోత్సవాలు గర్వకారణం

చంద్రబాబు ట్వీట్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్టీఆర్‌ గౌరవార్థం అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి జూన్‌ 3 వరకు తెలుగు వారసత్వ వారోత్సవంగా ప్రకటించడంపై తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు జాతికి దక్కిన మరో ప్రపంచ గుర్తింపు అని కొనియాడారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన నార్త్‌ కరోలినా గవర్నర్‌ రాయ్‌కూపర్‌కు సోమవారం ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ప్రకటన ప్రతిని చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని