అట్లాంటాలో ఆటా కాన్ఫరెన్స్ ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్

ATA 18వ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ అట్లాంటాలో ప్రత్యేక సందడి నెలకొల్పింది.

Published : 10 Dec 2023 15:55 IST

ATA 18వ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ అట్లాంటాలో ప్రత్యేక సందడి నెలకొల్పింది. సుమారు 1000 మందికిపైగా ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.  గణనాథుని ఆరాధన, జ్యోతిప్రజ్వలనతో శ్రీకారం చుట్టిన ఆ అద్భుత సాయంత్రం.. నృత్య, సంగీత, వినోదాత్మక కార్యక్రమాలతో ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. 

ATA కన్వెన్షన్ డోనర్సు, స్పాన్సర్లు, కన్వెన్షన్ కోర్ టీం సభ్యులతో పాటు ఆయా కమిటీ ఛైర్‌, కో- ఛైర్‌, అడ్వైజర్‌, మెంబర్ల పరిచయం,  సత్కార కార్యక్రమాలు సందడిగా జరిగాయి. అట్లాంటా తరుఫున కన్వెన్షన్ కొరకు 1.45 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ గర్వించదగ్గ క్షణంగా నిలిచింది.

ఈ సందర్భంగా ATA ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ప్రసంగిస్తూ.. ATA 18వ కన్వెన్షన్ కొరకు అట్లాంటా చేపడుతున్న అద్భుత సన్నాహాలకు, అనూహ్య నిధి సేకరణకు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విశిష్ఠ అతిథి మిమిక్రీ రమేష్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వివిధ ప్రణాళికలు,  ప్రతిపాదనలు, సందేశాలతో కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం, కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కన్వెన్షన్ డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, కో- కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో- డైరెక్టర్ శ్రీరామ్, కన్వెన్షన్ అడ్వైజర్ కమిటీ ఛైర్‌ గౌతమ్ గోలి, కన్వెన్షన్ అడ్వైజర్లు కరుణాకర్ అసిరెడ్డి వెంకట్ వీరనేని ప్రసంగాలు చేశారు.

పలు జాతీయ, ప్రాంతీయ తెలుగు సంఘాలు TANA, NATA, TTA, TDF, GTA , TAMA, GATeS, GATA , శంకర్ నేత్రాలయ వారు సహాయ సహకారాలు అందించారు. ATA కిక్ ఆఫ్ కార్యక్రమం ప్రత్యేక ప్రశంసనందుకుంది.

ఈవెంట్ కోఆర్డినేటర్లు అనుపమ సుబ్బగరి, శృతి చిట్టూరి, ఉదయ ఈటూరి, మల్లిక దుంపల, శ్వేత, ఈవెంట్ యాంకర్లు శ్రావణి రాచకుళ్ళ, మాధవి దాస్యం, రీజనల్ డైరెక్టర్ గోపి కొడాలి, రీజనల్ కోఆర్డినేటర్లు సందీప్, గణేష్ కాసం & కిషన్ , స్టాండింగ్ కమిటీ ఛైర్లు,  సభ్యులు జయ చంద్ర, ఉమేష్ ముత్యాల, శివ రామడుగు, రఘు వలుసాని, నిరంజన్ పొద్దుటూరి, శ్రీధర్ పాశం, కీర్తిధర్, కాన్ఫరెన్స్ కో- కన్వీనర్ ప్రశాంతి అసిరెడ్డి, కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదిని తదితరులు ఆద్యంతం అద్భుత సహకారాన్ని అందిస్తూ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. రీజనల్ డైరెక్టర్స్ కృతజ్ఞతాభివందనాలతో కార్యక్రమం విజయవంతం ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని