అమెరికాలో ఘ‌నంగా ‘మాటా’ కిక్-ఆఫ్ ఈవెంట్‌లు

శ్రీనివాస్ గనగోని సారథ్యంలో ఏర్పాటైన మన అమెరికన్‌ తెలుగు సంఘం (MATA) కొద్ది కాలంలోనే అమెరికాలోని తెలుగు వారితో మమేకమవుతోంది.  పలు ప్రాంతాల్లో వేగంగా విస్త‌రిస్తూ అరుదైన ఘ‌న‌త సాధిస్తోంది.

Published : 26 Dec 2023 22:33 IST

వాషింగ్టన్‌: శ్రీనివాస్ గనగోని సారథ్యంలో ఏర్పాటైన మన అమెరికన్‌ తెలుగు సంఘం (MATA) కొద్ది కాలంలోనే అమెరికాలోని తెలుగు వారితో మమేకమవుతోంది. పలు ప్రాంతాల్లో వేగంగా విస్త‌రిస్తూ అరుదైన ఘ‌న‌త సాధిస్తోంది. తాజాగా చికాగో, సియాటెల్, బే ఏరియాలో కిక్-ఆఫ్ ఈవెంట్‌లు నిర్వహించారు. అగ్రరాజ్యంలోని పలు ప్రాంతాల్లో తెలుగు కమ్యూనిటీని కనెక్ట్ చేస్తున్న ‘మాటా’ కొత్త‌ మైలురాళ్లను నెల‌కొల్పుతోంది. ఈ క్ర‌మంలో MATA చికాగో కిక్-ఆఫ్ ఈవెంట్‌ ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి గౌర‌వ అతిథిగా కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణ‌మూర్తి పాల్గొని ప్ర‌సంగించారు. ఈ ఈవెంట్‌కు మాటా చికాగో స‌భ్యులు తరలివచ్చి విజయవంతం చేశారు. 

‘మాటా’ సియాటెల్ చాప్టర్ WAలోని బెల్లేవ్‌లోని ఈస్ట్‌సైడ్ బహాయి సెంటర్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత కాన్సులేట్‌ జనరల్ ప్రకాష్ గుప్తా, గౌరవ అతిథిగా కాన్సుల్ & హెడ్ ఆఫ్ ఛాన్సరీ సురేష్ కుమార్ శర్మతో పాటు ప‌లువురు ప్రముఖులు పాల్గొన్నారు. సియాటెల్ చాప్టర్ కిక్-ఆఫ్ భాగంగా తెలుగుజాతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ తెలుగు రుచుల విందును ఏర్పాటు చేశారు.  ప్రముఖ నేపథ్య గాయకుడు వేణు శ్రీరంగం ప్రత్యక్ష సంగీత విభావరి హైలైట్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌లో మిస్‌ టీన్ ఇండియా వాషింగ్టన్‌ విజేత శ్రియా గడ్డం పాల్గొని సంద‌డి చేశారు. ఇటీవల జరిగిన మిస్‌ టీన్‌ ఇండియా వాషింగ్టన్‌ 2023లో తెలుగమ్మాయి శ్రియా విజేతగా నిలిచారు. అలాగే, మిస్ టీన్ ఇండియా ఫిలాంథ్రపీ యూనివర్స్‌ 2023 టైటిల్‌ను సైతం గెలుచుకున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ స్కూల్‌ (ICS)లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె.. 2024లో మిస్‌ ఇండియా అమెరికా పోటీల్లో వాషింగ్టన్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు.

MATA బే ఏరియా చాప్టర్ దాని కిక్-ఆఫ్ ఈవెంట్‌ CAలోని డబ్లిన్ Blvdలోని పీకాక్ బాంక్వెట్ హాల్‌లో నిర్వహించింది. తెలుగు సమాజం పట్ల ఇదే విధమైన స్నేహభావం, నిబద్ధతతో ఈ సమావేశం కొన‌సాగింది. ఈ ఈవెంట్‌లో వినోదాన్ని జోడించి వేణు శ్రీరంగం చేసిన సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో ‘మాటా’ బే ఏరియా సభ్యులు పాల్గొన్నారు. 

తమ కిక్-ఆఫ్ ఈవెంట్‌లు విజ‌యవంతమైన సంద‌ర్భంగా మాటా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ.. వ‌రుస‌గా మూడు చాప్ట‌ర్‌ల విజయవంతమైన కిక్-ఆఫ్ ఈవెంట్‌లకు తన అభినందనలు తెలియజేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, ఐక్యతను పెంపొందించడం, తెలుగు సమాజం గొప్ప వారసత్వాన్ని పరిరక్షించడంలో MATA కొన‌సాగిస్తున్న నిబద్ధతను వివ‌రించారు.

‘మాటా’ ఫ్యామిలీలో చేర‌డానికి ఒక అరుదైన అవ‌కాశం క‌ల్పిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు, మీ స్నేహితులకు ఉచితంగా MATA రెగ్యులర్ మెంబర్‌షిప్ ఇస్తోంది. ఐదేళ్లపాటు చెల్లుబాటయ్యే $ 25 విలువైన గిఫ్ట్‌ను సైతం అందిస్తోంది. డిసెంబ‌ర్ 31లోపు మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకునే అవ‌కాశం కల్పిస్తోంది.  https://mata-us.org/mata_membership సాధారణ సభ్యత్వం 5 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని