షార్లెట్‌లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో 40 వసంతాల వేడుకలు

తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రం షార్లెట్‌లో ఘనంగా నిర్వహించారు. స్థానిక స్ట్రోన్క్రీన్‌

Published : 29 Mar 2022 14:15 IST

షార్లెట్‌: తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రం షార్లెట్‌లో ఘనంగా నిర్వహించారు. స్థానిక స్ట్రోన్క్రీన్‌ రాంచ్‌ హాల్లో తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు సమావేశమయ్యారు. అనంతపురానికి చెందిన తెదేపా ఎన్‌ఆర్‌ఐ నేత పురుషోత్తం చౌదరి గుడే అధ్యక్షతన జరిగిన ఆవిర్భావ వేడుకల్లో తొలుత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం 40వ ఆవిర్భావ దినోత్సవ కేక్‌ను కట్‌ చేశారు. ఆ తర్వాత షార్లెట్‌ సిటీ ఎన్‌ఆర్‌ఐ నేతలు మాట్లాడుతూ తెదేపా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎదురైన పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా పార్టీలో తమ అనుభవాలను పంచుకున్నారు. తెదేపాను స్థాపించిన తర్వాత పేదలు, మహిళలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలను కొనియాడారు. చంద్రబాబు నాయకత్వంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి అందరూ మరింత ఉద్ధృతంగా ముందుకు నడవాల్సిన అవసరముందని చెప్పారు.

అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, నరసాపురం తెదేపా నేత మోహన్‌ కొవ్వలి తదితరులు ఈ సమావేశానికి ఆన్‌లైన్‌ ద్వారా హజరై మాట్లాడారు.  ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు పార్టీ, తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ తెదేపాతో తనకున్న అనుబంధం, ప్రస్తుత పరిస్థితులు, చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధిని తెలిపారు. అమెరికాలో తమ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ షార్లెట్‌ తెదేపా నేతలు ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేయడాన్ని అతిథులు ప్రశంసించారు. ఏపీలో మళ్లీ తెదేపాను అధికారంలోకి తీసుకొచ్చేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ వేడుకల్లో పాల్గొన్న వారిని నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని