పొత్తుకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దు: నాగబాబు

రానున్నది జనసేన-తెదేపా ప్రభుత్వమని.. పొత్తుకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దని, అధినేత పవన్‌కల్యాణ్‌ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అందరి బాధ్యత అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు శ్రేణులకు స్పష్టం చేశారు.

Published : 24 Sep 2023 06:02 IST

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: రానున్నది జనసేన-తెదేపా ప్రభుత్వమని.. పొత్తుకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దని, అధినేత పవన్‌కల్యాణ్‌ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అందరి బాధ్యత అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు శ్రేణులకు స్పష్టం చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, జీడీ నెల్లూరు, సత్యవేడు, మదనపల్లె నియోజకవర్గాల... కార్యకర్తలు, నాయకులతో శనివారం తిరుపతిలో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు. దుర్మార్గ, దౌర్జన్య పాలనను అంతమొందించాలంటే క్షేత్రస్థాయిలో జన సైనికులు, వీర మహిళలు... తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలసి పని చేయాలని సూచించారు. వ్యవస్థలు, అధికారులను మేనేజ్‌ చేయడంతో జగన్‌ దిట్ట అని, అధికారులు ఇప్పుడు తప్పుచేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాగబాబు హెచ్చరించారు. రాక్షస పాలనను అంతమొందించాల్సిన బాధ్యత జన సైనికులపై ఉందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని