‘పాలమూరు’పై విపక్షాలది వితండవాదం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలది వితండవాదమని, ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు వారంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

Published : 24 Sep 2023 04:43 IST

మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలది వితండవాదమని, ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు వారంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో తక్కువ ముంపు-ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. అన్ని విఘ్నాలను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించినా విపక్షాలు దుష్ప్రచారాలను ఆపడం లేదని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. పాలమూరుకు నీళ్లొస్తే విపక్ష నేతల రాజకీయ జీవితాలు శాశ్వతంగా కూలిపోతాయనే భయంతోనే విషప్రచారం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని