కేసీఆర్‌ స్వార్థ రాజకీయాలతోనే సింగరేణి ఆగమాగం: ఈటల

సింగరేణి సంస్థకు గనులు దక్కక ఆగమవడానికి సీఎం కేసీఆర్‌ స్వార్థ రాజకీయాలే కారణమని భాజపా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Updated : 24 Sep 2023 06:36 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: సింగరేణి సంస్థకు గనులు దక్కక ఆగమవడానికి సీఎం కేసీఆర్‌ స్వార్థ రాజకీయాలే కారణమని భాజపా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కొత్తగూడెంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీ రంగాకిరణ్‌ నివాసంలో, కొత్తగూడెంలోని భాజపా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఈటల మాట్లాడారు. ‘‘ఉపరితల గనుల(ఓసీ)తో తెలంగాణను బొందల గడ్డగా మార్చారంటూ ఉద్యమ సమయంలో పాలకులను దుయ్యబట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆ మాటే మరిచారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికల జోలికి వెళ్లడం లేదు. పదవుల ఆశచూపి ఇతర పార్టీల నాయకులను భారాసలో చేర్చుకుంటున్నారు.  రాష్ట్రంలో 17 ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఇంతకంటే అసమర్థ పాలన ఉంటుందా’’ అని ప్రశ్నించారు. సమావేశంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని